RTC వారు 2019 లో సమ్మె చేశారు కదా ! మరి ప్రభుత్వ ఉద్యోగులగా మన సమస్యల పరిష్కారానికి మనం ఎందుకు సమ్మె చేయడానికి వెనకడుగు వేస్తున్నాం ?
RTC ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారు కార్మిక చట్టాల పరిధిలో ఉంటారు. వారు సమ్మె చేసే హక్కును కలిగి ఉంటారు.
ప్రభుత్వ ఉద్యోగుల క్రమశిక్షణా నియమావళి ప్రకారం సమ్మె చేసే హక్కుని కలిగి ఉండరు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలోకి అంత తేలికగా వెళ్లలేరు. అనేక దశల తరువాత చివరి అస్త్రంగా మాత్రమే ఈ స్థాయికి చేరగలరు.
ఎప్పుడో NTR గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉద్యోగులు సమ్మె కు వెళ్లారు. ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ/ సమైక్యాంధ్ర కోసం చేసిన సమ్మె మాత్రమే, సమ్మె చేసిన సందర్భాలు ఉన్నాయి.
0 Post a Comment:
Post a Comment