Saturday, 18 December 2021

రాష్ట్రంలో దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలు

 రాష్ట్రంలో దిగజారిపోతున్న విద్యా ప్రమాణాలు : టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ 




ఇప్పటికైనా దొంగ లెక్కలు చెప్పడం మానుకోండి

టి ఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ 

జగన్‌ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోతున్నాయని టి ఎన్ ఎస్ ఎఫ్  రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ విమర్శించారు. విద్యారంగంపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. ‘ఐదు కేటగిరీలతో 41అంశాలతో ఈ సర్వే నివేదిక తయారు చేశారు. ఒక్కదానిలో కూడా ఏపీకి కనీసం ఐదో స్థానం కూడా దక్కలేదు. బాల, బాలికల అక్షరాస్యత తేడాలో ఏపీ 12వ స్థానంలో, విద్యా ప్రమాణాల్లో 15వ స్థానంలో ఉంది. అందుబాటులో విద్య, కనీస వైద్య సదుపాయాల్లో 11వ స్థానంలో, పరిపాలనలో మరీ ఘోరంగా 21 స్థానంలోకి పడిపోయింది. నాడు-నేడు అని ఈ ప్రభుత్వం గొప్పలు చెబుతోంది కానీ విద్యా మౌలిక సదుపాయాల్లో దేశంలో 19వ స్థానంలో ఉంది. జగన్‌ సొంత పత్రిక మాత్రం మొదటి స్థానమని గొప్పలుచెప్పుకొంటోంది. ఇప్పటికైనా దొంగలెక్కలు మాని విద్యాప్రమాణాల పెంపుపై దృష్టి పెడితే మంచిది’ అని ప్రణవ్‌ పేర్కొన్నారు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top