Tuesday, 28 December 2021

ఉద్యోగులకు అవమానం _ సముచితమైన రీతిలో పీఆర్‌సీ ప్రకటించాలి

 ఉద్యోగులకు అవమానం _ సముచితమైన రీతిలో పీఆర్‌సీ ప్రకటించాలి




అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ ఫిట్‌మెంట్‌ ఎంత సిఫారసు చేసిందో బహిర్గతం చేయకుండా, సీఎస్‌ నేతృత్వంలో కమిటీ వేసి, ఐఆర్‌లో సగమే ఫిట్‌మెంట్‌ ఇస్తామని ప్రకటనలు చేయడం ఉద్యోగులను అవమానించడమే అవుతుందని సీపీఎం ఆరోపించింది. విజయవాడలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభల్లో రెండో రోజైన మంగళవారం మూడు తీర్మానాలు ప్రవేశపెట్టింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగులకు సముచితమైన రీతిలో పీఆర్‌సీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానాలు చేసింది. అనంతరం ఆ వివరాలను రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు, దడాల సుబ్బారావు, వి.కృష్ణయ్య, మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు మీడియాకు వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినదాని కంటే ఎక్కువ పీఆర్‌సీ ఇస్తానని జగన్‌ పదే పదే చెప్పారని వారు గుర్తుచేశారు. మరీ ఎక్కువగా ఊహించుకోవద్దని, ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పడం సహేతుకం కాదన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తెగుళ్లతో మిర్చి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయని, వాటిని అంచనా వేసి ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని, మిల్లర్లతో సంబంధం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మహాసభల చివరిరోజైన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక జరగనుంది. సీనియర్‌ నాయకుడు వి.శ్రీనివాసరావు ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top