Friday, 17 December 2021

తెరపైకి సీనియార్టీ జాబితా

 తెరపైకి సీనియార్టీ జాబితా



ఉపాధ్యాయుల సమగ్ర సీనియార్టీ జాబితా రూపకల్పన మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో సేకరించిన వివరాల ఆధారంగా ఎమ్మార్సీల్లో విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది భౌతిక పరిశీలన నిర్వహిస్తున్నారు. శుక్రవారం విజయనగరం మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించారు. వీరు విధుల్లో చేరిన తేదీ.. కులం.. విద్యార్హతలు తదితర సర్వీసు వివరాలను సేకరించారు. శనివారం నుంచి మండలాల వారీగా పరిశీలన నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సమగ్ర సీనియార్టీ జాబితా రూపొందించాలన్న డిమాండ్‌ ఆది నుంచి ఉన్నా, జిల్లాలో ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆన్‌లైన్‌తో సీనియార్టీలో ఎవరు ఎక్కడున్నారో? ఎప్పటికి ఉద్యోగోన్నతి వస్తుందో ముందే తెలుసుకునే అవకాశం ఉండటంతో న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. దృష్టి, చెవుడు, మూగ, శారీరక వైకల్యమున్న వారిని ముందుగానే మెడికల్‌ బోర్డుకు పంపి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. లేదంటే చివరి సమయంలో రిపోర్టు నెగెటివ్‌ వస్తే తదుపరి వారికి ఉద్యోగోన్నతులివ్వకుండా ఖాళీగా ఉంచడంతో సర్వీసును కోల్పోవాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘ నాయకులు అంటున్నారు.

డీఈవో ఏమన్నారు...

జిల్లాలో పది వేల మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ, జడ్పీ యాజమాన్యంలో 8,900 మంది ఉన్నారు. వీరి సర్వీసు వివరాలను సేకరించి సీనియార్టీ జాబితాను రూపొందించి, ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని డీఈవో పి.బ్రహ్మాజీరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

రాష్ట్రస్థాయి నుంచే విడుదల :

జిల్లాలో జులైలో ఉపాధ్యాయుల వివరాలతో కూడిన హార్డ్‌, సాఫ్ట్‌కాపీలను అందజేశారు. వీటిని ప్రదర్శించి, ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఆగస్టు ఒకటో తేదీన తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా రాష్ట్రస్థాయి నుంచే సీనియార్టీ జాబితాను విడుదల చేసి, శాఖకు ప్రమేయం లేకుండా వెబ్‌ కౌన్సెలింగ్‌ తరహాలో ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించే అవకాశముంది.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top