టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు : మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ
త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో ప్రత్యేకంగా రూపొందించిన డైరీ, క్యాలెండర్లను మంత్రి సురేష్ ఆవిష్కరించారు. తాడేపల్లిలోని మంత్రి కార్యాలయంలో గురువారం ఆపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ శ్రావణ్ కుమార్, ఎస్. బాలాజీ, కోశాధికారి ఎం. సురేష్ కుమార్, నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను, 3, 4, 5 తరగతుల విలీనం, ఉపాధ్యా యులు సర్దుబాటుతో కలిగే ఇబ్బందులు, తదితర విషయాలతో వినతిపత్రాలను మంత్రికి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను, విలీనం, సర్దుబాటు ఇబ్బందులను విద్యాశాఖ సెక్రటరీ, కమిషనర్లతో మాట్లాడి పరిష్క రించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలన్నీ పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోట సునీత, ప్రకాశం జిల్లా అధ్యక్షులు దిలీప్ కుమార్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు చంద్రశేఖర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment