Friday, 24 December 2021

'అమ్మఒడి' పై చలనచిత్రం : ప్రధానోపాధ్యాయుడి పాత్రలో ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ

 'అమ్మఒడి' పై చలనచిత్రం : ప్రధానోపాధ్యాయుడి పాత్రలో ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ



ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నవ రత్నాల్లోని అమ్మఒడి పథకం పేరు మీద శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్ ఓ చలనచిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే వెండితెర మీదకు రానున్న ఈ చిత్రంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషి స్తున్నారు. పాడేరు మండలంలోని దిగుమో దాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశా లలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. తహసీల్దార్ ప్రకాష్ రావు ఎమ్మెల్యేకు క్లాప్ కొట్టారు. షూటింగ్ అనంతరం ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ పథకాలలో అమ్మఒడి ఒకటని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు-నేడు పేరుతో ఊహించని రీతిలో అభివృద్ధి చేశారని కొనియాడారు. అమ్మఒడి పథకంపై చలనచిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ చిత్రానికి త్రినాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top