Tuesday, 28 December 2021

పీఆర్‌సీ ప్రకటనలో మరికొంత జాప్యం _ ఆర్థిక పరిస్థితిని సమతూకం చేస్తున్నందువల్లే ఇలా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

 పీఆర్‌సీ ప్రకటనలో మరికొంత జాప్యం _ ఆర్థిక పరిస్థితిని సమతూకం చేస్తున్నందువల్లే ఇలా : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

సీఎం జగన్‌కు పరిస్థితిని నివేదించిన ఆర్థికశాఖ



ఫిట్‌మెంట్‌ ప్రకటించేయడం కాదు.. దాని ప్రభావం, దానివల్ల ఉద్యోగులు ఎంతమేర లబ్ధి పొందగలరు, అనుకున్నంత పొందగలరా లేదా.. ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఈ రెండేళ్ల సంక్షోభం ప్రభావం ఇంకా కొనసాగుతున్న దశలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సి వస్తోంది. అందువల్లే పీఆర్‌సీ ఖరారు జాప్యమవుతోంది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘పరిస్థితి బాగోకపోయినా ఉద్యోగులకు సంతృప్తికరమైన పీఆర్‌సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. వీటిని సమతూకం చేయడానికే అధికారులు కసరత్తు చేస్తున్నారు’ అని చెప్పారు. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ ప్రతిపాదనలతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం లెక్కలను ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు మంగళవారం నివేదించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించారు. అధికారుల కమిటీ సూచించిన 14.29% ఫిట్‌మెంట్‌ కంటే ఎంత ఎక్కువ ఇస్తే ఆర్థికభారం ఎంత పడుతుందనే దానిపై కొన్ని ప్రతిపాదనలను వారు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. ఆర్థిక పరిస్థితిని సమతూకం చేసుకుంటూ ఉద్యోగులకు వీలైనంత మంచి ఫిట్‌మెంట్‌ ఇచ్చేలా కసరత్తు చేయాలని సీఎం వారికి సూచించారని, దీనిపై అధికారులు కసరత్తు చేసి మళ్లీ ముఖ్యమంత్రికి నివేదించనున్నారని సజ్జల తెలిపారు. సమావేశానంతరం సజ్జల విలేకర్లతో మాట్లాడారు. ‘పీఆర్‌సీ ప్రకటన కావాలని జాప్యం చేయాలనే ఎత్తుగడ సీఎం జగన్‌కు లేదు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు. ‘బాధ్యతారహితంగానో లేదా రాజకీయంగా చూసుకుంటేనో అయితే ప్రకటించేయొచ్చు. ఆర్థికశాఖ చెప్పినట్లో లేదా సీఎం అనుకున్నదాని ప్రకారమో ఇవ్వచ్చు. కానీ, వీటిని సమతూకం చేయడానికే ప్రయత్నిస్తున్నాం. అధికారుల కమిటీ చెప్పిన ఫిట్‌మెంట్‌ శాతం పరిస్థితిని లెక్కలోకి తీసుకుని కసరత్తు చేసి చెప్పిందే తప్ప ఊరికే చెప్పింది కాదు. కానీ, ఉద్యోగులు అసంతృప్తికి గురి కాకూడదు, ఉన్నంతలో బాగా ఇవ్వాలని సీఎం చెప్పారు. అందుకే అధికారులు మళ్లీ కసరత్తు చేస్తున్నారు. ఎవరో వచ్చి ప్రశ్నించే పరిస్థితి రాకూడదనే ఈ ప్రయత్నం’ అని తెలిపారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top