Monday 27 December 2021

విద్యాహక్కు రూల్స్ సవరణ ఉపసంహరించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ

 విద్యాహక్కు రూల్స్ సవరణ ఉపసంహరించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ



రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి ఏకపక్షంగా విద్యాహక్కు చట్టపు నిబంధనలను సవరిస్తూ సోమవారం ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రకార్యదర్శి పి మధు సోమవారం ప్రకటన విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలకు 1కి.మీ లోపే పాఠశాల ఉండాలని పేర్కొన్నారు. మన దేశపు గ్రామీణ సామాజిక ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, పార్ల మెంటు ఆ చట్టం చేసిందని తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం దీనిని పాటిస్తూ వచ్చిందని పేర్కొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన 6 రకాల పాఠశాలలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల పరిధిని 3 కి.మీటర్లకు పెంచిందని తెలిపారు. ఫలితంగా ప్రస్తుతం 1 కి.మీ లోపు అందుబాటులో ఉన్న ప్రాథమిక పాఠశాలలు కనుమరుగవుతాయని పేర్కొన్నారు. 3 నుండి 5వ తరగ తుల పిల్లలు కూడా 3 కి.మీ దూరంలోని ఫ్రీ హైస్కూల్ కి వెళ్ళాల్సి వస్తుందని తెలిపారు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రమూ చేయని దుస్సాహసమని పేర్కొ న్నారు. పిల్లల ప్రాథమిక హక్కుకు ఈ చర్య తీవ్ర విఘాతం కలిగిస్తుందని, పేదపిల్లలకు బడిదూరం 3 రెట్లు పెరుగుతుందని తెలిపారు. దీంతోపాటు వేల ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయని, ఉపాధ్యాయుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకుతో సాల్ట్ పేర రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొన్న ఒప్పం దంలో భాగంగానే ఈ సంస్కరణకు పూనుకొందని, దీన్ని తక్షణం ఉపసంహరించు కోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top