ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంచే యోచన లేదు : స్పష్టం చేసిన కేంద్రం
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు (ITR) గడువును పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదనేమీ తమ వద్దకు రాలేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐటీఆర్ దాఖలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 5.62 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయన్నారు. ఈ ఒక్కరోజు 20 లక్షల మంది రిటర్నులు సమర్పించారన్నారు. ఈ ఏడాది 60 లక్షల అదనపు రిటర్నులు దాఖలయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఐటీఆర్ దాఖలుకు నేటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై స్పష్టతనిచ్చింది. నేడు జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో తరుణ్ బజాజ్ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment