Wednesday, 22 December 2021

సిఎం వద్దే తేల్చుకుంటాం - సిఎస్‌తో ఉద్యోగ సంఘాల నేతలు. ఫిట్‌మెంట్‌ తగ్గకుండా చూడాలని సూచన

 సిఎం వద్దే తేల్చుకుంటాం - సిఎస్‌తో ఉద్యోగ సంఘాల నేతలు. ఫిట్‌మెంట్‌ తగ్గకుండా చూడాలని సూచన


పిఆర్‌సిపై సిఎం వద్దే తేల్చుకుంటామని, అధికారుల ఇచ్చిన నివేదికను తాము అంగీకరించడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శికి తేల్చిచెప్పారు. సుమారు నాలుగు గంటలపాటు ఉద్యోగ సంఘాల నాయకులను కూర్చోబెట్టిన అధికారులు ఏమీ తేల్చకుండానే అతి తక్కువ సమయంలో ముగించేశారు. పిఆర్‌సి, ఉద్యోగుల ఇతర డిమాండ్లపై బుధవారం సాయంత్రం సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్య సంఘాల ప్రతినిధులతో సిఎస్‌ సమావేశం నిర్వహించారు. దీనికి ఎపి జెఎసి, ఎన్‌జిఓ, ప్రభుత్వ, సెక్రటేరియట్‌, ఉపాధ్యాయ, ట్రెజరీ తదితర ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎస్‌ సమావేశానికి రాగానే ఉద్యోగ సంఘాల నాయకులతో ' ఏమి కావాలో చెప్పండి, మీ డిమాండ్లు ఏమిటి' అని ప్రశ్నించారు. దీంతో సమావేశానికి వెళ్లిన వారందరూ విస్తుపోయారు. మీ డిమాండ్లు చెబితే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ సిఎస్‌ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికను తాము అంగీకరించడం లేదని, ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడే తేల్చుకుంటామని తెలిపారు. దీనికి ఆయన సరేనంటూ క్రిస్ట్‌మస్‌ తరువాత సిఎంతో సమావేశం ఉండొచ్చని తెలిపారు. అనంతరం బయటకు వచ్చిన నాయకులు మీడియాతో మాట్లాడుతూ 71 అంశాలపై చర్చించామని, ఆర్థికేతర అంశాలను గతంలోనే సిఎస్‌కు వివరించామని తెలిపారు. అలాగే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోనూ మాట్లాడామని కొత్తగా మాట్లాడేదేమీ లేదని పేర్కొన్నారు. ఐఆర్‌కు తగ్గకుండా ఫిట్‌మెంట్‌ ఉండాలని అంతకుమించి తగ్గకుండా చూడాలని తెలిపారు. కనీసం 27 శాతం ఫిట్‌మెంట్‌ ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు బండి శ్రీనివాస్‌, బప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ, ప్రసాదు, హృదయరాజు, వై.వి.రావు, అశోక్‌రెడ్డి పాల్గన్నారు.

అంతకుముందు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన సిఎస్‌ జిల్లాల వారీగానూ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూదని తెలిపారు. ప్రమోషన్ల కమిటీని ఏర్పాటు చేసి వెంటనే ప్రమోషన్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top