Sunday, 19 December 2021

ఎంఇఒల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

 ఎంఇఒల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక



ఎంఇఒల సంఘం నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైంది గుంటూరులోని మండల విద్యా వనరుల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలకు పరిశీలకులుగా బి.నాగేంద్రవదన్‌ వ్యవహరించారు. గౌరవాధ్యక్షులుగా ఎస్‌.ఎం.ఎం.అబ్దుల్‌ ఖుద్దూస్‌, సిఆర్‌కె దేవరాయలు, అధ్యక్షులుగా వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి కిషోర్‌, సంయుక్త కార్యదర్శిగా కె.బాబ్జి, కోశాధికారిగా నరసింహమూర్తి, డైరీ కమిటీ అధ్యక్షులుగా డి.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంఇఒల వేతనాలకు సంబంధించి సెల్ఫ్‌ డ్రాయింగ్‌ పవర్స్‌ ఇవ్వాలన్నారు. ఎంఇఒలను బదిలీ చేయకపోవడంతో రాజకీయ వేధింపులకు గురవుతున్నారని, తక్షణమే బదిలీలు చేపట్టాలని, ఇతర మండలాలకు ఇన్‌ఛార్జుల బాధ్యతల నుంచి తప్పించాలని, వాహన సదుపాయం కల్పించాలని, ఎంఆర్‌సి భవనాలను మండల విద్యాశాఖాధికారి భవనాలుగా మార్చాలని, కార్యాలయానికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌ రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని కోరారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Top