నేడు పీఆర్సీపై జగన్ , కార్యదర్శుల కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి మంగళవారం కీలక భేటీ జరగనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ మరియు ముఖ్య కార్య దర్శులతో సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో ఫిట్మెంట్పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించారు సీఎస్. అయితే మంగళవారం సమావేశంలో పీఆర్సీపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను సీఎంకు వివరించనున్నారు. అధికారులు. సీఎంతో భేటీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగ సంఘాలకు ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇదిలావుండగా, ఉండగా పీఆర్సీపై ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. అయినా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా అధికారులు సూచించిన 14.29 శాతం మీదే ప్రభుత్వం నిలబడి ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు ఒక మెట్టు దిగి నా అధికారులు సూచించిన దానిని అన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గత వారం సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ అధ్యక్షతన జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పీఆర్సీ సమస్య పరిష్కారం కావాలంటే సీఎం తో ముఖా ముఖి సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘ నేతలందరూ కోరడం జరి గింది. ఈ వారంలో సీఎంతో సమావేశానికి ప్రయత్నం చేస్తానని సీఎస్ హామీ నిచ్చా రు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎంతో జరిగే సీఎస్, కార్యదర్సుల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలతో సీఎం ముఖాముఖి చర్చలకు ఆహ్వానిస్తే పీఆర్సీ పీఠముడి చిక్కు వీడుతుందని భావిస్తున్నారు. సీఎం ముఖాముఖి చర్చలకు ఆహ్వానించక పోతే సందిగ్ధగత కొన సాగనుంది. కాగా జనవరి3 లోపు పీఆర్సీపై ప్రభుత్వం ఆమోద యోగ్యమైన నిర్ణ యం ప్రకటించపోతే పోరుబాట తప్పదని ఐక్య జేఏసీ ఇప్పటికే ప్రకటన చేసిన విష యం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నని ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. కాగా ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని ఏపీ ఉపాద్యాయ సంఘాలు డిమాండ్ చేస్తు న్నాయి. వేతన సవరణ, సీపీఎస్ రద్దు తదితర డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షలమంది ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం కోరింది.
0 Post a Comment:
Post a Comment