Friday 31 December 2021

దేశానికే ఆదర్శం నాడు–నేడు : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

దేశానికే ఆదర్శం నాడు–నేడు : రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 



ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో నూతన శకానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో  కోటి రూపాయాలతో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ సెంటర్, రూ.ఏడు కోట్లతో నిర్మించిన క్రీడా వసతి గృహం, అతిథి గృహాన్ని గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  15 వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంస్కరణలు ప్రారంభించారని చెప్పారు.

ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. భావితరాల ప్రయోజనాల పరిరక్షణకు ముఖ్యమంత్రి దార్శనికతతో ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థికి   నాణ్యమైన ఉచిత విద్యను అంకితభావంతో అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 16 మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చరిత్రాత్మకమని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య పి.రాజశేఖర్, రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్, ట్రైనింగ్‌ సలహాదారు చల్లా మధుసూధన్‌రెడ్డి, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతమ్‌రెడ్డి, ఏఎన్‌యూ రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి.కరుణ, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top