Wednesday, 15 December 2021

పాఠశాల విద్యాశాఖ సలహాదారు పదవీకాలం పొడిగింపు : ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

 పాఠశాల విద్యాశాఖ సలహాదారు పదవీకాలం పొడిగింపు : ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం



  రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సలహా దారు (ఇన్స్ట్రక్చర్) ఎ. మురళి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం జీవో ఇచ్చారు. రాష్ట్రంలో మనబడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను మౌలిక సదుపాయాలు సమకూరుస్తూ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పనులను విజయవంతంగా చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళిని పాఠశాల విద్యాశాఖ సలహాదారు (ఇన్స్ట్రక్చర్ గా రెండేళ్ల కాలపరిమితితో నియమించింది. ఆయన పదవీకాలం ఇటీవల పూర్త యింది. నాడు-నేడు కింద 52 వేలకుపైగా పాఠశా లలు, అంగన్వాడీలు, జూనియర్ కాలేజీల్లో దశల వారీగా మూడేళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలివిడత పాఠశా లల్లో అభివృద్ధి పనులు ముగిశాయి. రెండో విడత పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మురళిని సలహాదారుగా మరో రెండేళ్లు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మురళి ఆధ్వర్యంలో ఇప్పటికే నాడు నేడు తొలివిడతలో రూ.3,600 కోట్లకు పైగా వెచ్చించి 15,715 స్కూళ్లను పూర్తి మౌలిక సదుపాయాలతో తీర్చి దిద్దారు. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం అనేక ప్రశంసలు అందుకుంది. పలు రాష్ట్రాలు నాడు- నేడును ఆదర్శంగా తీసుకుని అమలుకు చర్యలు చేపట్టాయి. తెలంగాణలో కూడా పాఠశాలలను అభివృద్ధి చేసేం దుకు అక్కడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్కారు తయారు చేయించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More

Subscribe Get Alerts

Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top