ఊపిరి పీల్చుకొనే ఒమిక్రాన్ వేరియంట్ షాకింగ్ నిజాలు చెప్పారు ఉత్తర్‌ప్రదేశ్ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్ డా. ఆర్.కే. ధీమాన్.
ఒమిక్రాన్ వేరియంట్ సోకిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎంతోమంది బాధితుల రిపోర్టులను తాను క్షుణ్ణంగా పరిశీలించినట్లు ధీమాన్ వెల్లడించారు. ఆ నివేదికల ప్రకారం ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం కాదని ధీమాన్ స్పష్టం చేశారు. అయితే వ్యాప్తి మాత్రం ఎక్కువ అని పేర్కొన్నారు.
ఆ ఇద్దరు...
డా. ధీమాన్‌తో పాటు, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్ డా. సమీరన్ పాండా.. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వ్యాప్తి, లక్షణాలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ ఇది డెల్టా వైరస్ కంటే ప్రమాదకరంకాదని తేల్చారు. అంతేకాకుండా ఈ వేరియంట్ సోకిన వారు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు కూడా చాలా తక్కువన్నారు. మరణాల శాతం కూడా తక్కువే ఉండటం ఊరట కలిగించే విషయమన్నారు. అయితే ఈ వైరస్‌పై ఇంకా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఆక్సిజన్ లెవల్...
" ఒమిక్రాన్ కంటే డెల్టా వైరస్ చాలా ప్రమాదకరం. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన రోగులు చాలా కంగారు పడుతున్నారు. కానీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగానే ఉంటున్నాయి. డెల్టా వైరస్‌లా ఒకేసారి ఆక్సిజన్ స్థాయి పడిపోవడం లాంటి పరిస్థితులు లేవు. "
- డా. ధీమాన్, ఉత్తర్‌ప్రదేశ్ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్
ఒక్క కేసు కూడా లేదు...
డెల్టా వేరియంట్ వచ్చిన కొత్తలో మరణాల రేటు గణనీయంగా పెరిగిందని, కానీ ఒమిక్రాన్ విషయంలో అలా లేదని ధీమాన్ అన్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఎంతమాత్రం ప్రమాదకరం కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ వేరియంట్ కేసు కూడా నమోదు కాలేదని గుర్తు చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
కంగారు పడొద్దు...
" డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారిలో ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. డెల్టా వేరియంట్ లాంటి పరిస్థితులు మాత్రం లేవు. అయితే అక్కడి రిపోర్టులు చూస్తే మాత్రం వ్యాప్తి ఉందని అర్థమవుతోంది. కానీ అంత ప్రమాదకరం కాదని తెలుస్తోంది. కనుక ప్రజలు అనవసరమైన వదంతులు నమ్మి కంగారు పడొద్దు. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పడానికి ఏం లేదు. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోన్న కారణంగా కరోనా నిబంధనలు మాత్రం పాటించాలి. "
- డా. సమీరన్ పాండా, ఐసీఎమ్‌ఆర్ ఎపిడెమియోలజిస్ట్ చీఫ్
0 Post a Comment:
Post a Comment