Friday 31 December 2021

పఠన నైపుణ్యాలు పెంచేందుకు 100 రోజులు - అన్ని పాఠశాలల్లో కార్యక్రమం

పఠన నైపుణ్యాలు పెంచేందుకు 100 రోజులు - అన్ని పాఠశాలల్లో కార్యక్రమం



విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచేందుకు బాలవాటిక (ఒకటో తరగతికి సన్నద్ధత) నుంచి ఎనిమిదో తరగతి వరకు వంద రోజులపాటు పఠన ప్రచారం నిర్వహించాలని సమగ్రశిక్ష అభియాన్‌ ఆదేశాలు జారీ చేసింది. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు అన్ని పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా స్థాయిలో జనవరి 6న ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. చిన్నప్పటి నుంచే పఠనాసక్తిని పెంచేందుకు, స్వతంత్ర పాఠకులుగా, జీవితకాల అభ్యాసకులుగా తీర్చిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. గ్రంథాలయాల సేవలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు. విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజిస్తారు. బాలవాటిక-రెండో తరగతి, మూడు-ఐదు తరగతులు, 6-8 తరగతుల గ్రూపులుగా విద్యార్థులు ఉంటారు. విద్యార్థులు చదవడాన్ని ఇష్టపడేలా వారానికో కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మూడు- ఐదు తరగతులకు మధ్యాహ్నం 1.35 గంటల నుంచి 2.55 వరకు భాష, గణిత కార్యకలాపాలు నిర్వహిస్తారు.

* ఆరు-ఎనిమిది తరగతులకు మధ్యాహ్నం 1.50గంటల నుంచి 3.20గంటల వరకు ఉంటుంది.

ఇలా చేస్తారు...

* పాఠశాలల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు.

* విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిపి తరగతి స్థాయి గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేస్తారు.

*వంద రోజుల పఠనానికి వారాల వారీగా కార్యకలాపాలు రూపొందిస్తారు.

* దాతలు, ఇతరుల నుంచి పిల్లల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను సేకరిస్తారు.

* కథనాలు చెప్పడం, పఠనాసక్తి పెంచేందుకు పిల్లల్ని సిద్ధం చేస్తారు.

* తల్లిదండ్రుల కమిటీలను ఆహ్వానించి పఠన పండగను నిర్వహిస్తారు.

* తరగతిలో రెండు పీరియడ్లను పుస్తక పఠన కార్యక్రమానికి కేటాయిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top