Monday 15 November 2021

జీడీపీ ( GDP ) అంటే ఏమిటి ? క్లారిటీ...

 జీడీపీ ( GDP ) అంటే ఏమిటి ? క్లారిటీ...




మనం టీవీ లలో న్యూస్ పేపర్ లలో GDP జీడీపీ పెరిగింది, తగ్గింది అని తరుచుగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ GDP అంటే ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి అసలు GDP అంటే ఏమిటి? అది ఎలా లెక్కిస్తారు? ఎందుకు అది అంత ముఖ్యమైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

GDP అంటే Gross Domestic Product. తెలుగులో స్థూల దేశీయోత్పత్తి* అని అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం finished products(అంతిమ వస్తువులు) మరియు సేవల మొత్తం విలువ ఎంత ఉంటుందో అది జీడీపీ అవుతుంది.

ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి. అది ఒక రోజు 20 రూపాయల విలువ చేసే ఒక సబ్బు, 10 విలువ చేసే చాకొలేట్, 50 విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని ఒక రోజు జీడీపీ 80రూపాయలు అవుతుంది. అదే విధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయ్యి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడీపీ అవుతుంది.

అయితే అన్ని ప్రోడక్ట్ ఈ GDP లోకి చేరవు. ఉదాహారానికి జపాన్ కి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ ని మన ఇండియాలో అమ్మితే అది మన GDP లో చేరదు. జపాన్ దేశపు GDPలో కలుస్తుంది.

అలాగే ఈ జీడీపీ లో మాధ్యమిక వస్తువులను లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే ఉదాహారానికి కారులో వాడే టైర్, సీట్ వంటివి ఉన్నాయి అనుకుందాం. మనం వాటిని నేరుగా ఉపయోగించలేము. కానీ వాటితో కారును తయారుచేస్తే దానిని ఉపయోగించగలం. ఇక్కడ టైర్ , సీట్ వంటివి మాధ్యమిక వస్తువులు, కార్ అనేది అంతిమ వస్తువు. జీడీపీ లో ఈ అంతిమ వస్తువుల విలువను మాత్రమే లెక్కిస్తారు.

మరొక ఉదాహరణ తీసుకుందాం. కాఫీ పొడి ఉంది అనుకుందాం దానిని మనం నేరుగా తినలేము. కానీ దానితో కాఫీ చేసుకుని తాగవచ్చు. కాబట్టి ఇక్కడ కాఫీ పొడి మాధ్యమిక వస్తువు అవుతుంది. కాఫీ అంతిమ వస్తువులోకి వస్తుంది.

మరి మన GDP పడిపోయింది అని వింటూ ఉంటాం దాని అర్ధం ఏమిటంటే మన దేశంలో తయారైన వస్తువులను మన దేశంలో ఎక్కువుగా అమ్ముడవడం లేదు. అంటే పక్క దేశాలకు చెందిన వస్తువులనే ఎక్కువగా కొంటున్నాం అని. ఇలా జరిగితే మన దేశంలో తయారైన వస్తువులను కొనడంలేదు కాబట్టి మన దేశంలోని కంపెనీలు కూడా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చెయ్యవు. ఉత్పత్తి లేకపోతె కంపెనీ కి లాభాలు ఉండవు. దానితో కొత్త ఉద్యోగాలు ఉండవు, లేదా ఉన్న ఉద్యోగులను తీసివేయడం జరుగుతుంది.

మళ్ళీ మన దేశ GDP పెరగాలంటే మన దేశంలో తయారైన వస్తువులను మనం ఎక్కువగా కొనాలి. అప్పుడే మన దేశంలో కంపెనీలు ఎక్కువగా వస్తువులను తయారుచేస్తాయి. దాని వాళ్ళ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.

ఈ జీడీపీ అనేది ఒక దేశ ఆర్థిక వ్యవ్యస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్దతిలో ఒక దేశం యొక్క జీడీపీ అనేది పెరుగుతూ ఉంటె ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్ధం.

మన దేశ ప్రధాని గారి సూచనలు పాటిద్దాం 

స్వదేశీ ఉద్యమం లో పాల్గొందాము

ఇక నుండి స్వదేశీ వస్తువులను వినియోగిద్దాము..

దేశ ఆర్థికాభివృద్దికి తోడ్పడుదాము..

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top