*_పెదబయలు_"*
విశాఖపట్నం జిల్లా
గిరిజన ఉపాధ్యాయునిపై భౌతిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిచాలని కోరుతూ అంబేద్కర్ కూడలిలో గురువారం ఉపాధ్యాయులు , విద్యార్థులు భారీ సంఖ్యలో మానవ హారం నిర్వహించారు.
చింతపల్లి మండలం లోతుగెడ్డ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న గిరిజన ఉపాద్యాయుడుపై అన్నవరం గిరిజనేతరులు, ఒక పార్టీ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ మండల గిరిజన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానం నుండి గిరిజనేతరులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ ఎస్‌ఐ మనోజ్ కుమార్‌కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. అదేవిధంగా మండల తహశీల్ధార్ టి కుమార స్వామికి వినతి పత్రం ఇస్తూ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గిరిజనేతరులు గిరిజన ప్రాంతంలో 1/70కు వ్యతిరేకంగా ఇళ్లు నిర్మించుకొని ఉన్నారని రెవెన్యూ అధికారులు తక్షణమే ఎల్‌టి ఆర్ కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మర్రిచెట్టు అప్పారావు, జర్సింగి శ్రీనివాసరావు నాయుడు, మర్రిచెట్టు వెంకటేశ్వర్లు నాయుడు, వెచ్చసంగి మాధవరావు, అడపా నాగమనాయుడు, యుటిఎఫ్ మండల అధ్యక్షులు జసంపారంగి సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు,పంచాయతీ కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు.
0 Post a Comment:
Post a Comment