Friday 5 November 2021

Language Improvement Programme : : 100 రోజులు , 500 పదాలు - త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం

Language Improvement Programme(L.I.P) : :  100 రోజులు , 500 పదాలు - త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం



   పిల్లల్లో భాషా సామర్థ్యం పెంచేందుకు ఓ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు . వంద రోజుల్లో 500 పదాలు నేర్పించేలా దీనిని రూపొందించారు . కోవిడా కారణంగా అభ్యస నంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని లాంగ్వేజ్ ఇంప్రూ వ్మెంట్ ప్రోగ్రామ్ ( లిప్ ) గా వ్యవహరించను న్నారు . 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజూ తెలుగు , హిందీ , ఇంగ్లిష్ భాషల్లో కొన్ని పదాలు నేర్చిస్తారు . 1.2 తరగతుల వారికి తెలుగు , ఇంగ్లిష్ లో రోజుకు 2 చొప్పున , 3 నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు మూడు భాషల్లో 5 చొప్పున పదాలు నేర్పిస్తారు . జగనన్న విద్యాకానుక డిక్షనరీలో ఈ పదాలు ఉంటాయి . వంద రోజుల పాటు ప్రయోగా త్మకంగా మూడు జిల్లాల్లో లిప్ అమలు చేయనున్నారు.

   సుమారు 200 నుంచి 500 పదాలు తెలిసి భాషపై పట్టు సాధించేలా చూస్తారు . ఉచ్ఛారణ దోషాలను కూడా సవరించనున్నారు.



పాఠశాలల్లో అమలు ఇలా...


ప్రతి పాఠశాలలో రోజూ 5 నిమిషాలు లిప్ కోసం కేటాయిస్తారు . • బోర్డుపై పదాలు కనిపించేలా ఉంచి , మెదడుపై ముద్ర వేసేలా చూస్తారు . • భాషా ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు .. • 1 , 2 ఒక గ్రూప్ .. 3 , 4 , 5 తరగతులు మరో గ్రూప్ . 6 , 7 , 8 తరగతులు ఇంకో గ్రూప్ ... 9 , 10 తరగతులను ఇంకో గ్రూప్ ను విభజించి అభ్యసనా సామర్థ్యాలు పెరుగుతాయి లిప్ కార్యక్రమం భాషా నైపుణ్యాల సాధనకు ఉపకరించే అద్భుతమైన కార్యక్రమం . ప్రతి పిరియడ్లోనూ అంత ర్భాగమే కనుక ఉపాధ్యాయునికి భారమయ్యే అవకాశం లేదు .

ఈ నెల 10 నుంచి మార్చి 31 వరకూ లిప్ అమలు చేస్తారు . వారానికోసారి 15 పదాలకు 15 మార్కులకు 10 నిమిషాల వ్యవధిలో స్వయం నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు . • 13 నుంచి 15 మార్కులు సాధించిన విద్యార్థికి ఎ . 10 నుంచి 12 వస్తే బి 7 నుంచి 9 వస్తే సి , 4 నుంచి 6 వస్తే డి , 4 కంటే తక్కువ వస్తే ఇ గ్రేడుగా కేటాయిస్తారు . • ప్రతి వారం అధికారులు సమీక్షించి వివరాలను ఆర్జేడీకి నివేదించాలి . • 85 నుంచి 100 శాతం సగటు వచ్చిన విద్యార్థుల స్కూలుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు . మిగిలిన స్కూళ్లకు కూడా రేటింగ్ ఉంటుంది . ఆ మెరుగైన ఫలితాలు సాధించిన స్కూలుకు సర్టిఫి కెట్ ఇస్తారు.

CLICK HERE TO DOWNLOAD

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top