Sunday, 24 October 2021

బూస్టర్‌ డోసుపై ఎయిమ్స్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

బూస్టర్‌ డోసుపై ఎయిమ్స్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు




వచ్చే ఏడాది నాటికి దేశంలో బూస్టర్‌ డోసు అవసరం ఉండొచ్చని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. వైరస్ ఉత్పరివర్తనం చెందితే బూస్టర్ డోసు తప్పనిసరని చెప్పారు.

★ దేశంలో బూస్టర్‌ డోసుల పంపిణీపై చర్చలు జరుగుతున్న సమయంలో దిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. 

★ కరోనా టీకా మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా పనిచేస్తాయనే అంశంపైనే బూస్టర్‌ షాట్ వినియోగం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

★ "బూస్టర్‌ డోసు వినియోగంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. యాంటీబాడీల ఆధారంగా బూస్టర్‌ షాట్‌ను ఇవ్వలేం. అది సమయం మీద ఆధారపడి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాలి. అయితే దీనిపై మరింత సమాచారం అవసరం." అని రణ్‌దీప్‌ గులేరియా అన్నారు.

★ మూడో డోసు వినియోగంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు గులేరియా తెలిపారు. 

★ ఈ టీకాపై ప్రభుత్వం వచ్చే ఏడాదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. 

★ వైరస్‌ ప్రభావం అధికంగా ఉండేవారు, వృద్ధులకే మొదట ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top