Monday, 13 September 2021

కొన్ని చెట్ల కింద ఎక్కువ చల్లగా ఉంటుంది. చెట్ల నీడల్లో ఆ తేడాలెందుకు?

 కొన్ని చెట్ల కింద ఎక్కువ చల్లగా ఉంటుంది. చెట్ల నీడల్లో ఆ తేడాలెందుకు?



దాదాపు అన్ని చెట్ల కింద నీడ ఉన్నట్లయితే వేసవి కాలంలో మనకు చల్లని అనుభూతి కలుగుతుంది. చెట్ల ఆకుల పరిమాణాన్ని బట్టి, శాఖల గుబురును బట్టి, దట్టమైన నీడ లేదా పలుచని నీడలు ఏర్పడతాయి. వేర్వేరు చెట్ల కింద వేర్వేరు స్థాయుల్లో చల్లదనాన్ని పొందడాన్ని నీడ తీవ్రతే కాకుండా ఆ చెట్ల ఆకులు మన తల మీద ఎంత ఎత్తులో ఉన్నాయన్న అంశం, ఆ చెట్లకు అందిన నీటి పరిమాణం కూడా ప్రభావితం చేస్తాయి. ఆకుల మధ్యలో, శాఖల మధ్యలో సందులు బాగా ఉన్నట్లయితే నీడ తీవ్రత తగ్గి చల్లదనం తక్కువగా ఉన్నట్లు భావిస్తాం. తలపై చెట్ల ఆకులు చాలా ఎత్తులో ఉన్నట్లయితే, నీడ బాగానే ఉన్నా చుట్టు పక్కల ఉన్న వేడిగాలి మనల్ని పదేపదే తాకుతూ ఉండటం వల్ల మనకు చల్లదనం భావన తక్కువగా కలుగుతుంది. ఒకవేళ చెట్ల ఎత్తు తక్కువగా ఉంటే చల్లదనం భావన బాగా ఉంటుంది. ఇక చివరగా ఆ చెట్లకు అందే నీటి పరిమాణం ఏవిధంగా చల్లదనాన్ని నిర్ణయిస్తుందో గమనిద్దాం. 

వేసవిలో ప్రతి చెట్టు నీటిని ఆదా చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల వాటి ఆకుల్లో సాధారణంగా జరిగే బాష్పోత్సేక ప్రక్రియ (transpiration)తగ్గిపోతుంది. తద్వారా వాటి కింద ఉన్న గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది. కానీ నీటి అవకాశం బాగా ఉన్నట్లయితే ఆ విధమైన ఆకుల్లో బాష్పోత్సేకం బాగా జరగడం వల్ల వాటి ఆకుల, శాఖల ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. వాటి మీదుగా వీస్తున్న గాలి కూడా చల్లగా ఉండి మనకు హాయిగా అనిపిస్తుంది. 

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top