Saturday, 14 August 2021

2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం - పాఠశాల నిర్వహణ మార్గదర్శకాలు

 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం - పాఠశాల నిర్వహణ మార్గదర్శకాలు





COVID 19 మహమ్మారి కారణంగా మూతపడినటువంటి పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి గాను 16-8- 21 నుండి పునః ప్రారంభించవలెను.


  పాఠశాలలు పునః ప్రారంభించే క్రమంలో అనుసరించవలసిన మార్గదర్శకాలు.


 🔆 గ్రామ సచివాలయం యూనిట్ గా 10 శాతం కన్నా తక్కువ పాజిటివిటి ఉన్న ప్రాంతాలలో మాత్రమే పాఠశాలలు పునః ప్రారంభించ వలెను.


🔆 10 శాతం కన్నా తక్కువ పాజిటివిటి ఉన్న  ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలో 16-8-21 నుండి ప్రారంభించవలెను.


🔆 పాఠశాలలు పునః ప్రారంభించే క్రమంలో తరగతికి 20 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు లేకుండా  ఉండేట్లుగా ప్రణాళికను తయారు చేసుకోన వలెను.


🔆 ఒకవేళ తరగతి / సెక్షన్ కు 20 మంది కన్నా ఎక్కువ లేకుండా ఉండే విధంగా పాఠశాలలో ని అందరు విద్యార్థులకు  సదుపాయం ఉన్నట్లయితే పాఠశాల లోని అందరు విద్యార్థులను పాఠశాలకు అనుమతించ వలెను.


🔆 అలా కాని పక్షంలో తరగతి/ సెక్షన్ కు 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా ప్రణాళిక తయారు చేసుకొని, విద్యార్థులను బ్యాచ్ ల వారీగా అనుమతించ వలెను.


 🔆 పాఠశాలలోని మరుగుదొడ్లను ప్రతిరోజు 1% సోడియం హైపోక్లోరైడ్ తో  తప్పనిసరిగా శుభ్రం చేయించవలెను.


🔆  పాఠశాలలోని బోధన, బోధనేతర, మధ్యాహ్న భోజన సిబ్బంది మరియు విద్యార్థులు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి.


🔆 విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితిని తప్పనిసరిగా గమనించవలెను.


🔆 వీలైనంత వరకు థర్మల్ స్కానర్ ద్వారా ప్రతి విద్యార్థి యొక్క శరీర ఉష్ణోగ్రతను పరిశీలించ వలెను ఏవైనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వారిని సమీపంలోని ఆరోగ్యకేంద్రం కు పంపి తగిన  టెస్టులు చేయించవలెను.


🔆 తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పాఠశాల అసెంబ్లీ కార్యక్రమాలు, గ్రూప్ లో చేసే పనులు, సామూహిక ఆటలు ఎట్టి పరిస్థితులలోనూ నిర్వహించరాదు.

🔆 విద్యార్థులకు హ్యాండ్ శానిటైజర్ ను అందుబాటులో ఉంచవలెను.


🔆 మధ్యాహ్న భోజనం ముందు.. తర్వాత తప్పనిసరిగా చేతులను (ఆరు దశల్లో )శుభ్రపరుచుకునే విధంగా చూడాలి.


🔆 తల్లిదండ్రుల యొక్క రాతపూర్వక అనుమతి పత్రం తో మాత్రమే విద్యార్థులను పాఠశాలకు అనుమతించ వలెను.

 

🔆 మధ్యాహ్న భోజనం ను అందరు విద్యార్థులకు ఒకే సమయంలో కాకుండా తరగతి వారీగా నిర్వహించ వలెను.


🔆 విద్యార్థులు ఒకరినొకరు పెన్నులు ,పెన్సిల్లు, ఇతర సామాగ్రి మార్చుకోవడం అనుమతించరాదు.


🔆 పాఠశాలకు విద్యార్థులను రవాణా చేసే బస్సులు / వ్యాన్ ల లో సగం కెపాసిటీ కి మ మాత్రమే అనుమతించ వలెను.


🔆 పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన ఇద్దరు ఉపాధ్యాయులు సభ్యులుగా కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయవలెను.


🔆 అదేవిధంగా మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారి అధ్యక్షతన కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయవలెను.


🔆 పాఠశాలలోని  బోధన, బోధనేతర , మధ్యాహ్న భోజన  సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోనవలెను.


🔆 విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులకు covid19 మహమ్మారి విషయంలో తీసుకోవలసిన  జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించాలి.


🔆 పాఠశాలల్లో అకడమిక్ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో భారత ప్రభుత్వం వారు నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించి వలెను.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top