Sunday, 11 July 2021

హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.

 హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి.


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.

ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు. చాలా మంది  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు. మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్. డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.

SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే. ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.

దాసరి నారాయణ రావు, జయలలిత ఇలా చాలా మంది చావుకు రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు. తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.

అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది?  ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా ? అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.

అందుకే మిత్రులారా హాస్పిటల్ అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ Opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు. అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.


జాగ్రత్త.... జాగ్రత్త....  జాగ్రత్త....

అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ....

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top