A) అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా ? హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా ?
B) ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది: 23-4-2013న భద్రాద్రి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000 సం,, లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది: 20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు. వీరిలో ఎవరు సీనియరు ?
ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సందర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది. 2000 సం,, లో అదే జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.
0 Post a Comment:
Post a Comment