పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు
ఇంటర్నల్స్ ఆధారంగా కేటాయింపు || కసరత్తు చేస్తున్న విద్యాశాఖ || ఇంటర్ పై హైపవర్కమిటీ పరిశీలన
కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో పదో తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయంతెలిసిందే. మొత్తం విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రకటించింది. అయితే విద్యార్థుల తదుపరి చదువుల కోసం మార్కుల అవసరం ఉండటంతో..విద్యాశాఖ ఏ విధంగా కేటాయించాలా అనే అంశంపై మదింపు చేస్తోంది. గతేడాది కూడా లాక్డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతోపాటు అందరికీ పాస్ అయినట్లుగా లాంగ్ మెమోలు జారీ చేసింది. అయితే అప్పుడు ఇంటర్ పరీక్షలు ప్రారంభమై, మధ్యలో ఆగిపోవడంతో లాక్డౌన్ అనంతరం తిరిగి నిర్వహించారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా అనివార్యం గా రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఇంటర్మీడియట్ మార్కుల కోసం ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి చాయారతన్ చైర్మన్ గా హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధా నాలను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగని విధంగా మార్కులు కేటాయించేలా కొన్ని ఆప్షన్లను సిద్ధం చేసి, ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. అంతర్గత మార్కుల ఆధారంగా :
పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై విద్యాశాఖ అధికారులు సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో వచ్చిన మార్కుల సగటు ఆధారంగా ఫైనల్ స్కోర్ ప్రకటించాలని నిర్ణయించారు. రెండు ఫార్మేటివ్ పరీక్షల ఫలితాల సరాసరిని పరిగణనలోకి తీసుకోవాలని, తద్వారా విద్యార్థులకు నష్టం జరగ కుండా ఉంటుందని భావిస్తున్నారు.. గతేడాది మార్కుల ప్రక్రియ కాకుం డా 'ఆల్ పాస్'గా ప్రకటించడంతో రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పదో తరగతి మార్కులను ప్రామా ణికంగా తీసుకుంటున్నారు. దీంతో మార్కులు లేకుండా మెమోలు జారీ చేయడం వల్ల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసంలో ఇబ్బం దులు ఎదురవుతున్నట్లు ప్రభు త్వానికి పలు వినతులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆల్ పాస్ కాకుండా మార్కులు, గ్రేడ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అందుకోసం ఫార్మే టివ్- 1లో ఎక్కువ మార్కులువచ్చిన మూడు సబ్జెక్టుల సరాసరి తీసు కుం టారు. ఇదే పద్ధతిలో ఫార్మేటివ్ 2లో మార్కులనూ తీసుకుంటారు. ఈ రెండింటినీ జత చేసి, వాటి ఆధారం గా మొత్తం గ్రేడ్, సబ్జెక్ట్ గ్రేడ్ ప్రకటిం చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కులు, గ్రేడ్ల కేటాయిం పుపై రెండు మూడు విధానాలను రూపొందించి ప్ర భుత్వానికి ప్రతి పాదనలు పంపినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే స్పష్టత రానుంది.
గతేడాది పాసైన వారికీ మార్కులు :
గతేడాది కరోనా కారణంగా పది పరీక్షలు రద్దయి, ఆల్ పాస్ గా ప్రభు త్వం ప్రకటించింది. అయితే పదో తరగతి అర్హతగా కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నావెల్ వంటి విభాగా లతోపాటు వివిధ సంస్థల్లో ఏటా వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తుం టుంది. ఈ నేపథ్యంలో కేవలం పాస్ సర్టిఫికెట్ ఆయా ఉద్యోగాలకు చెల్లుబాటు కాకపోవడంతో.. దరఖాస్తు చేసుకున్న వారికి గ్రేడ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. అందు కోసం విద్యార్థుల ఇంటర్నల్ మార్కు లను పరిగణనలోకి తీసుకుని, లెక్కించి సబ్జెక్టుల వారీగా గిడ్లు ప్రకటిస్తుంది. ఈసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇంటర్నల్స్ సగటుల ఆధారంగా మార్కులు, గ్రేడ్లు ప్రకటిం చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
0 Post a Comment:
Post a Comment