Tuesday 13 April 2021

తెలుగు సంవత్సరాల పేర్లు - వాటి అర్థాలు

 తెలుగు సంవత్సరాల పేర్లు - వాటి అర్థాలు




1. ప్రభవ - ప్రభవించునది అంటే పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల - అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత - ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి -  ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస - అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ - శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ -  భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ - యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత - అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర - పరమేశ్వరుడు.

12. బహుధాన్య - సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది - ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ - విక్రమం కలిగిన వాడు.

15. వృష - చర్మం.

16. చిత్రభాను - భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను - స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ - తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ -  పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ - ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు - సర్వాన్ని జయించినది.

22. సర్వధారి  - సర్వాన్ని ధరించేది.

23.విరోధి - విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి - వికృతమైనటువంటిది.

25. ఖర - గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన - కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ - విశేషమైన జయం కలిగినది.

28. జయ - జయాన్ని కలిగించేది. 

29. మన్మథ - మనస్సును మధించేది.

30. దుర్ముఖి - చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి - సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి - సాగదీయడం.

33. వికారి -  వికారం కలిగినది.

34. శార్వరి - రాత్రి.

35. ప్లవ - తెప్ప. కప్ప, జువ్వి ,దాటించునది అని అర్థం.

36. శుభకృ - త్శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్శో - భను కలిగించేది.

38. క్రోధి - క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు - విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ - అవమానం.

41. ప్లవంగ - కోతి, కప్ప.

42. కీలక - పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య - మృదుత్వం.

44. సాధారణ - సామాన్యం.

45. విరోధికృత్ - విరోధాలను కలిగించేది.

46. పరీధావి - భయకారకం.

47. ప్రమాదీచ - ప్రమాద కారకం.

48. ఆనంద - ఆనందమయం.

49. రాక్షస - రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల - నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ - ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి - కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి - కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి - రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి -దుష్ట బుద్ధి.

56. దుందుభి - వరుణుడు.

57. రుధిరోధ్గారి - రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి - ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన - కోప స్వభావం కలది.

60. అక్షయ - నశించనిది


 నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top