Monday 26 April 2021

ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే: కేంద్రం సూచన

 ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిందే: కేంద్రం సూచన



  బయటికి వెళ్లినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాలట. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో నీతి అయోగ్ ఆరోగ్య విభాగం ఈ సూచన చేసింది. సోమవారం ఢిల్లీలో కోవిడ్ తీవ్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ ‘‘కోవిడ్ తీవ్రంగా ఉన్న కారణంగా అత్యవసరమైతే కానీ బయటికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో ఉన్న సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఈ సమయంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడమే మంచింది’’ అని పేర్కొన్నారు.

  మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశలో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఓ వైపు దేశంలో విస్తృతంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు కరోనా కూడా అదే స్థాయిలో విజృంభిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top