Tuesday 13 April 2021

ఎండతీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండతీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 




వడదెబ్బ లక్షణాలు :

☀️ తలనొప్పి,తల తిరగడం, తీవ్రమైన జర్వం కలిగియుండటం మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.

✅స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. టీవి చూడండి, రేడియో వార్తలు వినండి, వార్తాపత్రికలు  చదవండి.

✅ నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు  గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి.

✅వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి.

✅ ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగవచ్చును.

✅ వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని  ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.

✅ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని , నిమ్మరసముగాని, కొబ్బరినీరు గాని తాగాలి.

✅తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.

✅ ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి.

✅ తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి.

✅ మేడపైన మొక్కలు, ఇంట్లో ని  మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్)  భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.

☀️ ఎండ తీవ్రతంగా ఉన్నప్పుడు చేయకూడనివి :

❌ ఎండలో  గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో  నలుపురంగు,మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.

❌ మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు.

❌బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు.  వీరిపై ఎండ ప్రభావం త్వరగా  చూపే అవకాశం ఉంది.

❌ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే  పదార్దాలను తీసుకోవద్దు. 

❌ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి.

❌ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకొనకూడదు.

❌శీతలపానీయములు మరియు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము ఏర్పడుతుంది.

❌ ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు మరియు కిటికీలను తీసివుంచి తగినంత  గాలి వచ్చేవిదంగా చూసుకోండి.

❌ వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో  ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.

☀️ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కోవిడ్ -19 దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు :

🔹 బహిరంగ  ప్రదేశాల్లో ఉన్నప్పుడు  కనీసం  1  మీటరు భౌతిక దూరం పాటించాలి.

🔹 చేతులను నీరు, సబ్బుతో తరుచుగా శుభ్రపరుచుకోవాలి. నీరు,సబ్బు అందుబాటులో లేకపోతే శానిటైజర్లతో శుభ్రపరుచుకోవాలి.

🔹 ఇంటిలోని ప్రతి సభ్యునికి  తువ్వాళ్లు ఉంచాలి. వాటిని తరుచుగా శుభ్రపరుచుకోవాలి.

🔹 ఆనారోగ్యముతో ఉన్నట్లయితే ఎండలో తిరగరాదు, డాక్టర్ని సంప్రదించాలి. ఆనారోగ్యముతో ఉన్నవాళ్ళకు దూరంగా ఉండాలి.


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top