Saturday, 27 March 2021

శ్రీకాకుళం - తేదీ : 23-03-2021 డి ఈ ఓ గారు ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వాస్తవాలని కుండబద్దలు కొట్టి చెప్పి ప్రాతినిధ్యం చేసిన ఎస్టియు జిల్లా ప్రెసిడెంట్ పేడాడ ప్రభాకర్ రావు గారు.

శ్రీకాకుళం - తేదీ : 23-03-2021 డి ఈ ఓ గారు ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వాస్తవాలని కుండబద్దలు కొట్టి చెప్పి  ప్రాతినిధ్యం చేసిన ఎస్టియు జిల్లా ప్రెసిడెంట్ పేడాడ ప్రభాకర్ రావు గారు.
గౌరనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాతోటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఉద్యమ అభినందనాలు. 

మిత్రులారా... :

   రాష్ట్ర విద్యాశాఖ చేపట్టిన బదిలీలు హేతుబద్ధీకరణ చరిత్రను తిరగరాసిన 2020 బదిలీలు రీఅపోర్శన్ మూడు మాసాలు ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు సంక్రాంతి పండుగ పూట పరుగులు పెట్టించిన ఘనత నేటి విద్యా శాఖ ఉన్నతాధికారులు సొంతం చేసుకున్నారు. బదిలీల్లో అద్భుతాలు సృష్టించామని చెప్పుకుంటున్న ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా వీరులు శూరులు అని చెప్పుకుంటున్న పలువురు ఎమ్మెల్సీలు రీ అపోర్షన ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడిచినా బాధిత ఉపాధ్యాయులకు జీతాలు కూడా ఇప్పించ లేని సంఘాలలో ఒక సంఘానికి నాయకత్వం వహిస్తున్న అని చెప్పడానికి విచారిస్తున్నాను. మేడం గారు రీ అపో ర్షన్ కు  ముందు తర్వాత రాష్ట్రం, జిల్లా ప్రామాణికంగా ఉపాధ్యాయ పోస్టులు సంఖ్యలో మార్పు లేదు. అటువంటప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడానికి మనసు రాని మీలాంటి అధికారుల వైఖరి తీవ్ర మనస్తాపం మిగిల్చింది.

ఆవేదనకు అంతు లేదు... 

గత మే 18న మొదలైన నాడు నేడు ఒక అంతులేని కథలా కొనసాగుతోంది. లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న కాలంలో కూడా భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు హృదయపూర్వక అభినందనలు, కోటి దండాలు. రోజు ఉన్నత అధికారుల ఆకస్మిక తనిఖీలు, రికార్డులు, పి.ఎం.సి సమావేశాలు, తీర్మానాలు, మెటీరియల్ కొనుగోలు,పేమెంట్, ఇసుక దొరక్క విసిగిపోయిన ప్రాణాలు బిపి షుగర్ పెరిగి నవారు కొందరైతే... గుండెపోటుకు గురైన వారు మరికొందరు. నాడు-నేడు పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు పూర్తిగా ఒక పూట బోధనకు దూరమయ్యాడు అంటే అతిశయోక్తి కాదు. మేడం గదికి నాలుగు ఫ్యాన్లు, నాలుగు ఎల్ఈడి ట్యూబ్ వేస్తే విద్యాప్రమాణాలు వెలిగి పోవు. ఇవన్నీ ఒకేసారి ఆన్ చేస్తే కేటగిరీ-2 విద్యుత్ కనెక్షన్లు పవర్ సప్లై టోల్ రేట్ చేయలేక షార్ట్ సర్క్యూట్ అయి మాడి మసై పోవడమే కాకుండా విద్యార్థులకు ఏ ప్రమాదం వాటిల్లుతుందో అన్న ఆందోళనగా ఉంది. మేడం గారు ఈ విషయమై తమరు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి గౌరవ కలెక్టర్ గారి చేత ట్రాన్స్కో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇప్పించి నాడు నేడు పాఠశాలలు విద్యుత్ కనెక్షన్లను క్యాటగిరి-1 లోకి మార్పించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రజాపంపిణీ వ్యవస్థ గా మార్చేసిన పాపం ఎవరిది...? 

ఉపాధ్యాయుడు తెల్లవారి పాఠశాలలో అడుగుపెట్టింది లగ్గాఎత్తు యాప్ లతో ఆపసోపాలు పడుతూ..ఏడాదికాలంగా ఇంటర్నెట్ డాటా ఇవ్వలేదు, పాఠశాలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదు, కానీ ఈ యాప్ ల ద్వారా సమాచార సేకరణ పెరిగిపోయింది. ఉపాధ్యాయుడు ఒక పూట మొత్తం డాటా ఎంట్రీ ఆపరేట రులా యాప్ అప్డేట్ చేయడంతోనే కాలం నెట్టుకొస్తున్నారు. బట్టలు బూట్లు గుడ్లు బియ్యం, వండి వడ్డించడం, లేదంటే డ్రై రేషన్ పంపిణీలో తేలి మూలుగుతున్న పరిస్థితి.ఒక్క  మాటలో చెప్పాలంటే బోధన తప్ప అన్నీ చేస్తూ ప్రాథమిక విధి నిర్వహణ ధర్మాన్ని పాటించాలేక పోతున్నారు. అందుకు ప్రతి ఉపాధ్యాయుడు ఆవేదన ఆత్మహత్యా సదృశం అని తెలుపుటకు విచారిస్తున్నాను. ఉపాధ్యాయులు పర్సనల్ మొబైల్ డాటా షేర్ చేస్తూ పని చేస్తున్నారన్న కనీస అవగాహన లేకుండా, ఇంతవరకు కు పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేకపోయారు అనే స్పృహ కూడా లేని మరియు డాటా చార్జీలు విడుదల చేయని ఉన్నత అధికారులు వారి కార్యాలయాలు వలనే రాష్ట్రంలోని పాఠశాలలు కూడా ఉంటాయి అనుకొని యాప్ అప్డేట్ చేయని  ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్న పాలనా యంత్రాంగంలో నేను ఒక్కడిని అయినందుకు ఆవేదన చెందుతున్న. బోధన సమయాన్ని హరించి వేస్తూ, విద్యార్థి చదువుకునే హక్కును కాలరాస్తూ, వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న విధానాలు విరమించాలని మన పూర్వకంగా వేడుకుంటూ విద్యార్థులను క్షమాపణ కోరుతున్నాను.

మా బాధ పక్క రాష్ట్రంలో చెప్పుకుంటామా...?పాకిస్థాన్  తో చెప్పుకుంటామా...? 

విజ్ఞప్తులు.. ప్రాతినిధ్యాలు సంఘాలకు ఒక హక్కు. సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, రాజ్యాంగం కల్పించడం జరిగింది ఆ వర్గ ప్రయోజనాల సాధన కోసం రక్షణ కోసం సంఘం గా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసే హక్కు ప్రాతినిధ్యం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. అయితే ఇటీవల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు జారీ చేసిన ఉత్తర్వులు యాజమాన్యానికి ఉద్యోగ వర్గానికి మధ్య అంతరం పెంచేదిగా ఉంది. ఉద్యోగ సంఘాలు రాజకీయ నాయకులకు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం సిసిఎ రూల్స్ కు వ్యతిరేకం, చట్టవిరుద్ధం... అంటే మా సమస్యలు పక్క రాష్ట్రంలో మొరబెట్టుకోవాలా... గౌరవ DEO మేడం గారు

నమ్మబలికారు-మోసగించారు :

2020 బదిలీలు మరియు రీ అపోర్షన్ మార్గదర్శకాలు రూపొందించడంలో ఏడు దశాబ్దాలుగా విద్యారంగ పరిరక్షణకు త్రికరణశుద్ధిగా పని చేస్తూ ఎన్నో త్యాగాలకు సిద్ధపడిన ఉపాధ్యాయ సంఘాలను తేనెపూసిన మాటలతో బురిడీ కొట్టించారు. ఈ మాట చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను.రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాల లేకుండా చేస్తామని జీరో నుండి ఎంత మంది విద్యార్థులు ఉన్నా ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని నమ్మబలికి మూడవ పోస్టుకు 91 వద్ద ఎలిజిబిలిటీ రోజులుగా కటాఫ్ ఇంక్రీజ్ చేసి అటు పిదప ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఇస్తున్నారని ఆశపడి ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకున్నాయి.అయితే వాస్తవంలోకి దిగేసరికి రీ అపోర్షన్ జరగక ముందు జరిగిన తర్వాత ఎకోపాధ్యాయ పాఠశాలలో ఎలా ఉన్నాయో అలానే అదే పరిస్థితి కొనసాగడం అత్యంత మోసపూరితమైన ఎత్తుగడగా అభిప్రాయపడుతున్నాను. విద్యావాలంటీర్లు లేరు, ప్రతి జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ హామీ గాలికొదిలేశారు, అన్యాయంగా భావిభారత పౌరులు భవిష్యత్తుతో పాఠశాల విద్యాశాఖ ఆటలు ఆడుకుంటోంది. గౌరవ డీఈఓ మేడంగారూ అర్హులైన అనేక మంది ఉపాధ్యాయులు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేస్తున్నారు.రాజకీయ అవసరాల దృష్ట్యా పదోన్నతులు కాకుండా ఉద్యోగి సర్వీసును గౌరవిస్తూ, పాఠశాల విద్యార్థుల అవసరంగా ఉపాధ్యాయ పోస్టులు ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించవద్దని అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా పాఠశాలలో అవసరమైన పోస్టులు భర్తీ చేయాలని వినయపూర్వకంగా తమకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు(LFL) పోస్టుకు 150 రోజులు ప్రామాణికంగా తీసుకొని ఎగినేస్ట్ ఎస్ జి టి పోస్ట్ గా ఆ పాఠశాలను ఎలాట్ చేసి,ఈరోజు అలాంటి పాఠశాలలో ఎస్ జి టి లకు జీతాల కు అర్హత లేదని చెప్పి ఒక సాంకేతిక పరమైన ఇబ్బందిని అవగాహన రాహిత్యంతో సృష్టించి జీతభత్యాలకు నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాను. కొత్తగా ప్రాథమిక పాఠశాలలకు ఓ ఆర్ జి నెంబర్ ఈ రోజు వరకూ కూడా కేటాయించకపోవడంతో ఆ పాఠశాల UDISE యాక్టివేషన్ కాకపోవడం టీచర్ల pd account, ఈ హాజరు నమోదు ప్రతి విషయంలోనూ తలెత్తుతున్న సమస్యల పరిష్కారం నేటికీ చేయకపోవడం జిల్లా విద్యాశాఖ ద్వార వైఫల్యానికి ఒక ఉదాహరణ. ఉన్నత పాఠశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్న విషయం మీకు తెలుసు.

ఉపాధ్యాయుల అవసరాలుగా కాకుండా విద్యార్థుల అవసరాలుగా మరియు పాఠశాలలో అవసరాలుగా గుర్తించాలని, ఈ సందర్భంగా ప్రస్తావించిన అంశాలను రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదిస్తా రని మన పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదాలు.

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top