Saturday 9 January 2021

అమ్మ ఒడి పథకం

 అమ్మ ఒడి పథకం



రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల పిల్లల చదువు కోసం అయ్యే ఖర్చు భారాన్ని తగ్గించే దిశగా తమ పిల్లల్ని చదివించుకుని ఉన్నటువంటి తల్లికి ప్రతి సంవత్సరం 15 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది.

ప్రయోజనాలు :

ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు పొందిన టువంటి పాఠశాలలోనూ, ప్రైవేట్ పాఠశాలలను, జూనియర్ కళాశాల లోనూ, అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1 తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన టువంటి సంరక్షకులకు మత, కుల, ప్రాంత, వివక్ష లేకుండా సంవత్సరానికి 15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయబడును.

అర్హతలు :

   ✔ కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేల రూపాయల లోపు మరియు పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయలు కలిగిన వారు అర్హులు.

   ✔ తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ నెంబర్ ను కలిగి ఉండాలి.

   ✔ బియ్యం కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద అర్హత కలిగి కుటుంబాలకు చెందిన వారు అవునా కాదా అని ఆహారం ద్వారా నిర్ధారించి వారికి కూడా ఇస్తారు.

   ✔ స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలల్లో మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న అనాధ పిల్లలకు కూడా ఈ పథకం వర్తింపచేస్తారు.

   ✔ అర్హత కలిగినటువంటి తల్లులు లేదా సంరక్షకులు వారి పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉన్నది లేనిదీ కూడా పరిశీలించి ఉంచుకోవాల్సి ఉంటుంది.

   ✔ కుటుంబం మొత్తాన్ని కలిపి ఐదు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మొత్తం కలిపి పది ఎకరాలు మించి ఉండరాదు.

   ✔ కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం కారు ఉండకూడదు ట్రాక్టర్ ఆటో టాక్సీ క్యాబ్ మినహాయింపులు.

   ✔ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షన్ పొందేవారు ఉండకూడదు.

   ✔ కుటుంబంలో ఎవరూ కూడా ఆదాయ పన్ను చెల్లించే కూడదు.

   ✔ నెలసరి ఇంటికి కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించకూడదు.

దరఖాస్తు విధానం :

   ✔ ఈ పథకానికి 1-10 విద్యార్థులు ఏ పాఠశాలల్లో చదువుతుంటే అదే పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఈ పథకానికి అప్లై చేయడం జరుగుతుంది.

   ✔ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి కళాశాలలోనే ప్రతి సంవత్సరం ఈ పథకానికి అప్లై చేయడం జరుగుతుంది.

దరఖాస్తు కు కావలసినవి :

   ✔ విద్యార్థి ఆధార్ కార్డు

   ✔ తల్లి ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్

   ✔   రేషన్ కార్డ్










0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top