Monday 11 January 2021

వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక

 వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక




పింఛన్ రకాలు :

👉 వృద్ధాప్య పెన్షన్

👉 తంతు పింఛన్

👉 వికలాంగుల పింఛన్

👉 నేత కార్మికులు

👉 కల్లు గీత కార్మికులు

👉 మత్స్యకారులు

👉 డప్పు కళాకారులు

👉 చర్మకారులు

👉 హెచ్ఐవి బాధితులు

👉 ట్రాన్స్ జెండర్

👉 ఒంటరి మహిళ

👉 CKDU మరియు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు.

అర్హతలు : 

✔ మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు 10,000 మరియు పట్టణ ప్రాంతాలలో అయితే 12 వేల కంటే తక్కువ ఉండాలి.

✔ మొత్తం కుటుంబానికి మూడు ఎకరాల మాగాణి భూమి లేదా పది ఎకరాల మెట్ట లేదా మా గాని మరియు మెట్ట భూములు రెండు కలిపి పది ఎకరాల మించరాదు.

✔ కుటుంబం మొత్తానికి నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. (ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ మినహాయింపులు)

✔ కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారుడు వుండరాదు.

✔ కుటుంబం నివసిస్తున్న గృహం యొక్క నెలవారి విద్యుత్ వినియోగం బిలో 300 యూనిట్ల లోపు ఉండవలెను.

✔ పట్టణ ప్రాంతంలో నిర్మాణ స్థలం 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండాలి.

✔ కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయ పన్ను చెల్లించే పరిధిలో ఉండరాదు.

✔ సాధారణంగా ఒక కుటుంబానికి ఒక పెన్షన్ (40 % మరియు ఆ పైన అంగవైకల్యం కలవారు మరియు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మినహాయింపు) మాత్రమే.

పింఛన్ దరఖాస్తు కు కావలసినవి :

వృద్ధాప్య పింఛన్ :

★ అప్లికేషన్ ఫారం
★ వయస్సు 60 సం పైబడినవారు అయి ఉండాలి.
★ ఆధార్ కార్డ్
★ రేషన్ కార్డ్

వితంతు పింఛన్ :

★ అప్లికేషన్ ఫారం
★ 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.
★ భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి.
★ ఆధార్ కార్డ్
★ రేషన్ కార్డ్

వికలాంగులు : 

★ అప్లికేషన్ ఫారం
★ అంగవైకల్యం 40% పైబడి ఉండాలి.
★ సదరము ధ్రువపత్రం(వికలాంగుల ధ్రువీకరణ పత్రం)
★ ఆధార్ కార్డు
★ రేషన్ కార్డ్

చేనేత కార్మికులు :

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డు
★ రేషన్ కార్డ్
★ 50 సంవత్సరాలు పైబడి ఉండాలి.
★ చేనేత శాఖ వారి గుర్తింపు పత్రం ఉండాలి.

కల్లు గీత కార్మికులు : 

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డ్
★ రేషన్ కార్డ్
★ 50 సంవత్సరాల పైబడి ఉండాలి
★ ఎక్సైజ్ శాఖ వారి గుర్తింపు పత్రం ఉండాలి.

మత్స్యకారులు :

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డు
★ రేషన్ కార్డు
★ వయస్సు 50 సంవత్సరాలు పై ఉండాలి.
★ మత్స్య శాఖ వారి గుర్తింపు పత్రం ఉండాలి.

డప్పు కళాకారులు :

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డ్
★ రేషన్ కార్డు
★ వయస్సు 50 సంవత్సరాలు పైబడి ఉండాలి.
★ సాంఘిక సంక్షేమ శాఖ వారి గుర్తింపు ఉండాలి.

హెచ్ఐవి బాధితులు :

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డ్
★ రేషన్ కార్డ్
★ ART సెంటర్ నందు 6 నెలలు క్రమం తప్పకుండా గా మందులు వాడి ఉండాలి.

ట్రాన్స్ జెండర్ :

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డు
★ రేషన్ కార్డ్
★ వయస్సు18 సంవత్సరములు
★ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారి సర్టిఫికెట్

ఒంటరి మహిళలు :

★ అప్లికేషన్ ఫారం
★ ఆధార్ కార్డు
★ రేషన్ కార్డ్
★ చట్ట ప్రకారం భర్త నుండి విడిపోయిన ధ్రువ పత్రం. (పెళ్లి విడాకులు తీసుకున్న వారు)
★ అవివాహితులుగా ఉన్నవారు MRO నుండి  ధ్రువపత్రం.

✅ పెన్షన్ అప్లై చేయుటకు పైన తెలిపిన వివరాలతో వాలంటీర్ ను గాని లేదా సచివాలయమును సంప్రదించవలెను.





YSR PENSION KANUKA - IMPORTANT PENSION REPORT LINKS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top