Sunday 31 January 2021

మధ్యాహ్నభోజన పధకం మరియు విద్యార్థుల హాజరు - ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు పునః ప్రారంభ సూచనలు.

మధ్యాహ్నభోజన పధకం మరియు విద్యార్థుల హాజరు - ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు పునః ప్రారంభ సూచనలు.





➡️ ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, ఫిబ్రవరి,1 వ తేదీ నుండి ప్రాధమిక పాఠశాలలు పున:ప్రారంబము అవుతున్నందున పాఠశాలలో గల అందరు విద్యార్ధులకు క్రమం తప్పకుండా రోజు మెనూ ప్రకారం మధ్యాహ్నాభోజనం అందించగలరు.

➡️ అదేవిధంగా వారికి తగిన గ్రుడ్లు మరియు చిక్కిలు ప్రస్తుతం మీ పాఠశాలలో లేని యడల వెంటనే ఆయా ఏజెన్సీ వారికి ఫోన్ చేసి తగినంత స్టాకు ఉంచగలరు.

➡️  ఫిబ్రవరి నెలకు సంబందించిన బియ్యం ROs విడుదల కాబడినవి. కావున మీ మీ FP Shop వారి వద్దకు వెళ్ళి వెంటనే బియ్యం తీసుకోగలరు.

➡️ MEALS TAKEN DETAILS ను ప్రతిరోజు కూడా “ జగనన్న గోరుముద్ద" యాప్ మరియు IMMS app లో నమోదు చేయవలయును.

➡️ప్రతిరోజూ కూడా MDM inspection report  వివరాలను, School sanitation వివరాలను IMMS app లో తప్పకుండా నమోదు చేయవలయును.

STUDENTS ATTENDANCE :


APCFSS-MOBILE APPS  ను GOOGLE PLAY STORE నుండి DOWNLOAD చేసుకొని UDISE CODE & Child info Password తో Login అయిన తరువాత Data Synchronize చేసి App  ద్వారా ప్రతి రోజు All Management's Schools  వారు తప్పని సరిగా Attendance ను నమోదు చేయాలి. CSE వారు ప్రతి రోజు Observe చేస్తారు కాబట్టి Attendance నమోదు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది.

HEADMASTERS- MUST DO IN MDM APP AND IMMS ON DAILY BASIS :


అందరు ప్రధానోపాధ్యాయులకు మధ్యాహ్న భోజన పధకం నకు సంబందించి తెలియజేయునది ఏమనగా.... 

1. ప్రతిరోజూ JAGANANNA GORUMUDDA(MDM) యాప్ లో  హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు.

2. అదే విదంగా ప్రతిరోజూ IMMS యాప్ లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను.

3. ప్రతిరోజూ IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM) లో inspection form లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

4. ప్రతిరోజూ IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS) లో inspection form లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను.

పైన చెప్పబడిన పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

 IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది Chief Minster Dash Board వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పష్టంగా కనబడుతుంది గమనించగలరు.

IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు : 


IMMS యాప్ Inspection లో బాగంగా 4 - Tire మానిటరింగ్ సిస్టమ్ గా రూపొందించబడినది. అందులో బాగంగా

1. ప్రధానోపాధ్యాయులు inspection

2. PMC కమిటీ inspection

3. Welfare/Ward Education Assistant inspection

4. Village Organiser inspection

✔ పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే ID లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క ID లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. ఒకవేళ మ్యాప్ కానీయడల HM MAPPING లో వల్ల ID ఎంటర్ చేసి మ్యాప్ చేయవచ్చును.  వాళ్ళు మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి IMMS యాప్ లో  సబ్మిట్ చేయడం జరుగుతుంది. 
   
✔ కాబట్టి IMMS యాప్ విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా “జగనన్న గోరుముద్ద పధకం”  విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.


IMMS APP ⤵️

https://play.google.com/store/apps/details?id=com.tcs.imms


STUDENTS ATTENDANCE APP ⤵️

https://play.google.com/store/apps/details?id=in.apcfss.apcse.school.hm


JAGANANNA GORUMUDDA ⤵️

https://play.google.com/store/apps/details?id=mdm.ap.nic.schoolattendanceapp

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top