Wednesday 13 January 2021

రైస్ కార్డ్ మరియు రేషన్ కార్డ్

రైస్ కార్డ్ మరియు రేషన్ కార్డ్


ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, ఇంటి వద్దకే నాణ్యమై తో కూడిన నిత్యవసర సరుకులు అందజేయుడం.

అర్హతలు :

  ✔  కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేల లోపు పట్టణ ప్రాంతాలలో 12 వేల లోపు ఉన్న వారు అర్హులు.

  ✔  సంబంధిత కుటుంబానికి మాగాని భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా రెండు కలిపి పది ఎకరాలు మించకూడదు.

  ✔  కుటుంబం ప్రస్తుతం నివసిస్తున్న అటువంటి గృహం యొక్క నెలసరి విద్యుత్ వినియోగం బిల్లు 300 యూనిట్లు మించరాదు.

  ✔  పట్టణ ప్రాంతాలలో పది వేల చదరపు అడుగుల స్థలం అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్న వారే అర్హులు.

  ✔  కుటుంబ సభ్యులలో ఎవరికీ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు. (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు మినహాయింపు)

  ✔ కుటుంబ సభ్యులలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు మరియు ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పింఛన్ దారులు ఉన్నచో బియ్యం కార్డు పొందుటకు అనర్హులు(అన్ని శాఖలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు)

కొత్త రైస్ కార్డ్ కి  apply చేయుటకు :

★ కొత్త రైస్  కార్డు అప్లై చేయు వారు ఇంతకుముందు ఏ రేషన్ కార్డులో ఉండకూడదు.

★ కొత్త రైస్  కార్డ్ అప్లికేషన్ ఫారం

★ రైస్ కార్డు లో చేర్చాలి అనుకున్న కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్స్

 కొత్తగా పెళ్లైన మహిళలు చేర్చుటకు :

★ రైస్ కార్డులు చేర్చుటకు అప్లికేషన్ ఫారం

★ ఆధార్ కార్డు జిరాక్స్

★ పెళ్ళైన మహిళ ఇంతకు ముందు ఉన్న తల్లిదండ్రుల రైస్ కార్డు నెంబర్

కొత్తగా జన్మించిన పిల్లలను చేర్చుట :

★ Rice card చేర్చుటకు అప్లికేషన్ ఫారం

జన్మించిన పిల్లవాడి ఆధార్ కార్డు

★ జనన ధ్రువీకరణ పత్రం

★ తల్లిదండ్రుల రైస్ కార్డు జిరాక్స్

 కుటుంబం నుంచి విభజన :

★ రైస్ కార్డ్ విభజన అప్లికేషన్ ఫారం

కుటుంబం నుంచి విభజన కావాలనుకున్న వారి ఆధార్ కార్డు జిరాక్స్

★ ప్రస్తుతం అందరూ కలిసి ఉన్నాఉన్న రైస్ కార్డు జిరాక్స్

  ✔ అప్లై చేయుటకు పైన తెలిపిన టువంటి వివరాలతో నేరుగా గ్రామ/వార్డు సచివాలయంలో గాని లేదా గ్రామ/వార్డు వాలంటీర్లుగా ని సంప్రదించవలెను.

  ✔ అప్లై చేసిన వెంటనే అర్హులైన టువంటి దరఖాస్తుదారునికి యువర్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ను ఇవ్వడం జరుగుతుంది. 

  ✔ దరఖాస్తు చేసిన పది రోజులలో అర్హులైన దరఖాస్తుదారునికి బియ్యం కార్డు కేటాయించబడుతుంది.RICE CARD ADDING FORM


RICE CARD DIVISION APPLICATION


SINGLE PERSON RICE CARD APPLICATION


Splitting of Members from Ration Card Application Form


Ration Card/ Rice Card Search


RATION CARD / RICE CARD DETAILS


RATION CARD PROFILE


RICE CARD DETAILS

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top