Sunday 6 December 2020

బదిలీ అభ్యంతరాలపై పరిశీలన...! - స్వీకరణకు ముగిసిన గడువు - వేర్వేరు అంశాలపై ప్రశ్నించిన 332మంది.

 బదిలీ అభ్యంతరాలపై పరిశీలన...! - స్వీకరణకు ముగిసిన గడువు - వేర్వేరు అంశాలపై ప్రశ్నించిన 332మంది.





🔅 ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అభ్యంతరాలపై యుద్ధప్రాతిపదికన పరిశీలన జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో కేటగిరీ వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏయే క్యాడర్లలో ఎంతమంది బదిలీ అవుతారు? ఎంతమంది వినతి బదిలీ కోరుకున్నారు, వారికి వచ్చిన సర్వీస్‌, స్టేషన్‌ పాయింట్ల వివరాలతో సహా ప్రతిదీ జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలు స్వీకరించింది. దీనికి శనివారంతో గడువు ముగిసింది.

సాఫ్ట్‌వేర్‌లో మార్చలేదు :

🔅 తొలుత జీవో 56, 57 వచ్చాయి. ఆ తర్వాత కొన్ని సవరణలు చేసి మరో కొత్త జీవో ఇచ్చారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయలేదు. దీంతో ఉపాధ్యాయులకు కలవాల్సిన సర్వీస్‌, స్టేషన్‌ పాయింట్లు కొందరికి కలవలేదు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతుందని సాక్ష్యాధారాలతో కొందరు ఉపాధ్యాయులు అభ్యంతరాలు తెలిపారు. ప్రధానంగా వచ్చినవి ఇవీ...

🔅 ఇద్దరం ఒకే డీఎస్సీలో ఎంపికయ్యాం. ఒకే రోజున ఉద్యోగంలో చేరాం. అయినా పాయింట్ల విషయానికి వచ్చేసరికి నా కన్నా ఐదు పాయింట్లు అదనంగా వచ్చాయి? అదెలా సాధ్యం? వివరణ ఇవ్వాలంటూ ఓ ఉపాధ్యాయుడి నుంచి అభ్యంతరం.

🔅 అవివాహితులకు ఐదు పాయింట్లు కేటాయిస్తారు. అయితే దరఖాస్తులో గతంలో ఏమైనా ఈ కోటాలో పాయింట్లు పొందారా అని అడగ్గా కొందరు పొరపాటున ఆ మేరకు పొందకపోయినా అవును అని నింపారు. తీరా ఈ పొరపాటున గుర్తించి కొందరు ఉపాధ్యాయులు సరిచేయాలని వచ్చి కోరుతున్నారు. కొందరు మాత్రం పక్కాగా దరఖాస్తు చేసినా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవటంతో పాయింట్లు కేటాయించలేదు.

🔅 కొందరు భార్యాభర్తలు(స్పౌజ్‌) కోటాను ప్రస్తుతం వినియోగించుకోవాలనుకోవటం లేదు. అయితే దరఖాస్తు చేసినప్పుడు ఆ కోటా వినియోగించుకోవాలనుకున్నాం. దాన్ని సరిచేయాలని కోరేవారు కొందరైతే మరికొందరు గతంలో స్పౌజ్‌ కోటా వినియోగించుకున్నారు. తిరిగి మళ్లీ ఆ కోటాలో బదిలీ కోరుకుంటున్నారని సహచర ఉపాధ్యాయులే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

🔅 తొలుత 56, 57 జీవోలు జారీ చేసినప్పుడు ఒక పాఠశాలలో గరిష్ఠంగా పదేళ్లు పనిచేసినా ఎనిమిదేళ్లకు మాత్రమే పాయింట్లు గణించాలని ఆదేశాలున్నాయి. ఆ తర్వాత 57 జీవోలో దాన్ని ఎనిమిదేళ్లతో సంబంధం లేకుండా ఎన్నేళ్లు పనిచేస్తే అన్నేళ్లకు పాయింట్లు లెక్కించాలని సవరణ జీవో వచ్చింది. అయితే ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయకపోవటంతో తమకు ఎనిమిదేళ్లకే పాయింట్లు చూపించారని అదనంగా పని చేసిన సంవత్సరాలకు కూడా పాయింట్లు లెక్కించాలని కోరుతూ మరికొందరు అప్పీల్‌ చేసుకున్నారు.

🔅 క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులతో పాటు వైకల్యం కలిగిన వారు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ కోరుకుని అందుకు సంబంధించిన మెడికల్‌ ధ్రువపత్రం సమర్పించలేదు. దీంతో వారికి ఆ మేరకు పాయింట్లు కేటాయించలేదు. ఆ పత్రాలు అందజేయటంలో జాప్యం జరిగిందని వాటిని ప్రస్తుతం అందజేసి మరికొందరు పాయింట్లు కేటాయించాలని కోరుతున్నారు.

🔅 మొత్తం 332 అభ్యంతరాలు రాగా శనివారం నాటికి 179 అప్పీళ్లు పరిష్కరించామని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top