సోంపు విత్తనాలు తినటం వల్ల 12 రకాల లాభాలు కలుగుతాయని మీకు తెలుసా...
🔅 సాధారణంగా ప్రతి ఒక్కరు ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి సోంపుని తింటూ ఉంటారు. సోంపుని ఆంగ్లంలో ఫెన్నెల్ సీడ్స్ అని అంటారు. సాధారణంగా మనం అందరం సోంపు గా పిలుచుకునే ఈ విత్తనాలు తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మధుమేహ వ్యాధిని కూడా ఇది అదుపులో ఉంచగలదని చెబుతున్నారు. ఈ సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు, ఎన్నో అరుదైన పోషకాలు కూడా లభ్యమవుతాయి. వీటి వల్ల అవి మరింత శక్తివంతమైన మరియు పోషక పదార్ధాలను కలిగి ఉంటాయి.
🔅 మీకు తెలుసా ? చాలా పదార్థాలను తయారుచేసే క్రమంలో భాగంగా మంచి సువాసన రావడానికి సోంపు గింజలు వాడతారు. మౌత్ ఫ్రెషనర్లు, ఐస్ క్రీములు మరియు పేస్ట్ ఇలా అనేక వాటిల్లో సోంపు గింజలు వాడుతారు.
🔅 సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. ఈ రకమైన ఆరోగ్య లాభాలే కాకుండా, సోంపు గింజలను అనేక మందుల తయారీలో భాగంగా మరియు వంటల్లో కూడా తరచూ వాడుతుంటారు.
🔅 ఈ గింజలు సంవత్సరం మొత్తం దొరుకుతాయి. ఇవి సాధారణంగా పొడి రూపంలో దొరుకుతాయి లేదా గింజల రూపంలో ఉంటాయి.
సోంపు గింజల వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది :
🔅 సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటుని సాధారణంగా ఉండేలా చూస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైన అంశం.
నీరు అలాన ఉండి పోవడాన్ని తగ్గిస్తుంది :
🔅 సోంపు గింజల వల్ల సాధారణంగానే మూత్ర విసర్జన సరైన పద్దతిలో జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే ప్రాణాంతకమైన పదార్ధాలను మరియు అవసరం లేని ద్రవాలను బయటకు పారద్రోలడం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా చేయడం వల్ల మలమూత్ర నాళాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరియు చెమట పట్టేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి మల మూత్రనాళాలకు తరచూ ఎటువంటి ఇన్ఫెక్షన్లు శోక కుండా సోంపు విత్తనాలు కాపాడుతాయి.
0 Post a Comment:
Post a Comment