Saturday 3 October 2020

NISHTHA : DIKSHA శిక్షణ - ఒక అవగాహన

 NISHTHA : DIKSHA శిక్షణ - ఒక అవగాహన 




◾ 06.10.2020 నుండి జరిగే నిష్టా శిక్షణ లో దీక్షా యాప్ ద్వారా 1 నుండి 8 వ తరగతి వరకు బోధించే  ప్రతి ఉపాధ్యాయుడు పాల్గోనాలి.

◾ దీనికోసం ప్రతి ఉపాద్యాయుడు దీక్ష app డౌన్లోడ్ చేసుకుని వారి పేరు మీద ఒక అకౌంట్  (platform) కలిగి ఉండాలి.

◾ యూసర్ నేమ్ పాస్వర్డ్ గుర్తు పెట్టుకొండి. వీటి ద్వారా మాత్రమే ప్రతిసారి లాగిన్ అవ్వాలి.

◾ ప్రతి ఐదు రోజులకు ఒక మాడ్యూల్ చొప్పున మొత్తం 18 మాడ్యూల్స్ పై శిక్షణ ఉంటుంది.

▪️ ఉదాహరణకు మొదటి మాడ్యూల్ అక్టోబర్ 6 నుండి 9 వరకు. రెండవది 10 నుండి 14 వరకు

▪️ ఈవిధంగా దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుంది.

▪️ ప్రతి మాడ్యూల్ కి 5రోజుల సమయం కేటాయించటo  జరుగుతుంది.

ఈ 5 రోజుల లో...


మొదటి రోజు : మాడ్యూల్ అధ్యయనం/దానికి సంబంధించిన వీడియోలు చూడటం.

రెండవ రోజు : యూట్యూబ్ లో live class 6 pm to 7 pm ఉంటుంది.

మూడవ రోజు : మాడ్యూల్ అధ్యయనం/సంబంధిత వీడియోలు చూడటం.

నాల్గవ రోజు : మీరు ఎంపిక చేసుకున్న కృత్యం తయారీ మరియు సబ్మిట్ చేయాలి.

ఐదవరోజు : మీరు తయారు చేసిన అస్సెస్మెంట్ సబ్మిట్ చేయాలి.


▪️ప్రతి జిల్లాకి ఒక స్టేట్ రిసోర్స్ గ్రూప్ (SRG) ఉంటుంది.

▪️ప్రతి జిల్లాకి ఒక వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది.

▪️వాటి ద్వారా మీకు రిసోర్స్ పర్సన్స్ అందుబాటులో ఉంటారు.

▪️శిక్షణ లో అన్ని అంశాలు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ప్రధానం చేయబడును.

▪️ఈ కార్యక్రమాన్ని DEO గారు, SSA AMO'S,  డైట్ అధ్యాపకులు,  యస్.ఆర్.జీలు పర్యవేక్షిస్తారు. డైట్ ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top