Saturday 31 October 2020

రాత్రి నిద్రకు ముందు యాలకులుతిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు!!

 రాత్రి నిద్రకు ముందు యాలకులుతిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు!!




✔ సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి.. బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే.

✔ అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి.

✔ ముఖ్యంగా యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు.

✔ అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం.

✔ ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు.

✔ ఈ మద్య కాలం లో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. 

ఇంకా చెప్పాలంటే..

✔ నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి. 

✔ అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.

✔ అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది. 

✔ మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

✔ ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాటి వారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు.

✔ తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. 

మరీ ముఖ్యంగా..

✔ చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి.

✔ ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు.

✔ అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది. 

✔ రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది.

✔ అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top