Monday 26 October 2020

పాఠశాలలు తెరిచినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు - వానిలో కొన్ని ముఖ్యమైనవి

పాఠశాలలు తెరిచినప్పుడు  తీసుకోవలసిన జాగ్రత్తలు - వానిలో  కొన్ని ముఖ్యమైనవి






1. 1, 3, 5, 7 తరగతులు  ఒక  రోజు,  2, 4, 6, 8 తరగతులు  ఒక రోజు, 9, 10 తరగతులకు  ప్రతి  రోజు  ఉదయం  9 గంటల నుండి  మధ్యాహ్నం  1 గంటలవరకు  తరగతులను  నిర్వహించాలి.

2. పిల్లలు  పాఠశాలలోనికి  వచ్చేటప్పుడు  థర్మల్  స్క్రీనింగ్  చేసి లోపలికి  అనుమతించాలి.

3. మాస్క్  లేకపోతే పాఠశాలలోనికి అనుమతించ రాదు.

4. తరగతిలో  పిల్లలు 20 మంది  లోపే  ఉండాలి.

5. పాఠశాలలోని  తరగతి  గదులను  ప్రతిరోజు  శానిటేషన్  చేయించాలి.

6. మొదటి  పీరియడ్  లో  మరియు  చివరి  పీరియడ్ లో  ప్రతిరోజూ  10 నిమిషాలు  Covid 19 పై  పిల్లలకు  అవగాహన  కల్పించాలి.

7. పాఠశాల  ఎంట్రెన్స్ లో, తరగతి  గదులలో, ముఖ్యమైన  ప్రదేశాలలో  Covid19  నివారణకు  తీసుకోవలసిన స్లొగన్స్ ను  ప్రదర్శించాలి.

అవి...

   A) మాస్క్  లేదు,  ప్రవేశం లేదు.

   B) 6 అడుగులు  బౌతిక  దూరం  పాటిద్దాము.

   C) తరచూ చేతుల  సబ్బు  నీటితో  కడుగుకుందాం. 

8. పిల్లలు పుస్తకాలు  కాని  పెన్నులు కాని  ఒకరివి  మరొకరు మార్చుకోకుండా  చూడాలి.

9. ప్రతి విద్యార్థి నోట్స్  కరెక్ట్ చేయకుండా  బోర్డు  పై  వ్రాసి  Self  కరెక్షన్  ప్రోత్సహించవలయును.

10. పేరెంట్స్ నుండి Willing  లెటర్  కచ్చితంగా  తీసుకోవాలి.

11. Staff  అందరు  ఆరోగ్యసేతు  అప్  డౌన్లోడ్  చేసుకోవాలి.

12. పాఠశాలలో ఒక  Isolation  రూమ్  ఏర్పాటు  చేసుకోవాలి.

13. పిల్లలకు  చేతులతో  ముక్కు, నోరు, కళ్ళు ఎక్కువగా తాకవద్దని  తెలియచేయాలి.

14. పిల్లలలో కాని, టీచర్ లలో  కాని  Covid లక్షణాలు ఉంటే వారిని స్కూల్  లోపలకి  అనుమతించ కూడదు. 15. పిల్లల ఇంటిలో  కుటుంబ  సభ్యులలో ఎవరికైనా  Covid  ఉంటే వారిని స్కూల్ లోపలికి  అనుమతించ కూడదు.

16. పాఠశాలలో  యాక్టీవ్ గా  ఉంటూ 40 సంవత్సరాల  లోపు వయస్సు ఉన్న  ఒక టీచర్ ను  Covid  Resource  Person గా  నియమించాలి.

17. అతనికి  పిల్లలందరి  తల్లిదండ్రుల ఫోన్  నంబర్లు,ఆ  ప్రాంతములోని  ANM ల ఫోన్ నంబర్లు ఇవ్వాలి.

18. పిల్లలను,టీచర్లను అతను గమనిస్తూ ఉండాలి. ఎవరైనా  నీరసంగా గాని ఉంటే వారిని  Pulse  Oxymeter  తో  oxygen  లెవెల్  ను  చెక్ చేయాలి.

Oxygen level 90 కంటే  (సాధారణంగా  94శాతం ఉండాలి) తక్కువగా  ఉంటే  ఆ పిల్లలను  isolation రూమ్  లో  ఉంచి తల్లిదండ్రులను పిలిచి వారికీ  అప్పగించ వలయును.

19. ప్రతి టీచర్ Covid  కి  సంబందించిన  నియమాలను  పాటిస్తూ పిల్లలు కూడా  పాటించేలా చూడాలి.

20. మొదటి వారం రోజులు  పిల్లలకు  Covid  నిబంధనలను  విస్తృతంగా  వివరిస్తే  తరువాత  వారు  అలవాటు  పడతారని  అలా  చేయాలనీ  తెలియచేసారు.

పైన తెలిపిన నిబంధనలను పాటిస్తూ పిల్లలు మరియు టీచర్స్ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత  ఇస్తూ అత్యంత జాగ్రత్తగా పాఠశాలలను నిర్వహించవలయును.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top