నేడు 'ఆంధ్రరాష్ట్ర' 67 వ అవతరణ దినోత్సవం (1953 అక్టోబర్ 1)
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగం ఫలితంగా ఏర్పాటయినది.
మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి దేశంలో ఉన్నరాష్ట్రాలు కేవలం 14 మాత్రమే. పరిపాలనా సౌలభ్యం కోసం,ప్రజలు చేసిన ఉద్యమాల ఫలితంగా మరో 15 రాష్ట్రాలను భారత ప్రభుత్వం ఏర్పాటుచేసినది.2014 జూన్ 2 వతారీఖు ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయడముతో ఇప్పుడున్న మొత్తం రాష్ట్రాలసంఖ్య 29 కి చేరినది.
భారతదేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంద్రప్రదేశ్.భాషాప్రయుక్త రాష్ట్రమంటే ఒక భాషమాట్లాడే వారికి ఒకరాష్ట్రం ఉండడం. 1953 అక్టోబరు 1 న ఉమ్మడి మద్రాసు రాష్ట్రములో భాగంగా ఉన్న ఆంద్రులకు ''ఆంద్రరాష్ట్రం'' ఏర్పాటు చేయబడినది.తెలుగు భాష మాట్లాడే ఆంద్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రముంటేనే తెలుగు వారి అభివృద్ది సాద్యమవుతుందని భావించి..శ్రీ పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబరు 19 వ తేదీ మద్రాసు లోని బులుసు సాంబమూర్తి గారి ఇంటిలో నిహారధీక్ష ప్రారంభించి..56 రోజుల ధీక్ష తరువాత ఆరోగ్యం క్షీణించి 1952 డిసెంబరు 15 వతేదీ మరణించారు.దీనితో నాటి ప్రధానమంత్రి నెహ్రూ మద్రాసు రాష్ట్రములో కలిసి ఉన్న ఆంద్రులకు ''ఆంద్రరాష్ట్రం'' ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకంటించారు. దీనితో 1953 అక్టోబరు 1 తేదీ మద్రాసు రాష్ట్రములో అంతర్భాగంగా ఉన్న తెలుగు వారిని విడగొట్టి ఆంద్రరాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.
ఆంద్రరాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు.హైదరాబాద్ రాష్ట్రములోని ప్రజల్లో అధికసంఖ్యాకులు తెలుగువారే.ఈకారణంగా రెండురాష్ట్రాలలోని తెలుగువారు ఒకరాష్ట్రంగా ఏర్పాటయితే అభివృద్ది సాద్యపడుతుందని..రెండు రాష్ట్రాల నాయకులు ఒక ఒడంబడిక చేసుకున్నారు దీనినే ''పెద్దమనుషుల ఒప్పందం'' అంటారు.ఈఒడంబడిక ద్వారా హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రములో విలీనం చేయబడి 1956 నవంబరు 1 వ తారీఖు ''ఆంధ్రప్రదేశ్'" అవతరించినది.
ఆంధ్రప్రదేశ్ అవతరించిన 1956 నుండి 1972 వరకు రెండుప్రాంతాలవారు సమైఖ్యంగా ఉన్నారు.తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ ని అభివృద్ది చేసి రాయలసీమ,కోస్టల్ ఆంధ్ర ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని 1972 సం.లో ఆంధ్రులు లేవనెత్తిన '' జై ఆంద్రఉద్యమం'' ఆంధ్ర లో హింసాత్మక సంఘటనలకు దారితీసి సమస్యాత్మకంగా మారినది.1969 నుండి తెలంగాణ వారూ తెలంగాణ ప్రాంత వేర్పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తూ 2001 ఏప్రీల్ 27 వతేదీ కె.చంద్రశేఖరరావు ''తెలంగాణ రాష్ట సమితి'' ని ఏర్పాటు చేసి ''ప్రత్యేక తెలంగాణ'' రాష్ట్రఉద్యమాన్ని తీవ్రతరం చేయడముతో చివరకు 2014 జూన్ 2 వతేదీ యు.పి.ఏ '' కాంగ్రెస్'' ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని 23 జిల్లాలనుండి 10 జిల్లాలను విడగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసినది.10 జిల్లాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం..ఈ 10 జిల్లాలోని సరిహద్దులను మార్పులు చేసి మరొక 21 నూతన జిల్లాలను సృష్టించినది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం జిల్లాలు 31 కాగా ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం జిల్లాలు13.
0 Post a Comment:
Post a Comment