Saturday 26 September 2020

SIP in NPS : పెన్షన్ స్కీంలో పెట్టుబడులు. సిప్ ద్వారా భారీ రిటర్న్స్

 SIP in NPS : పెన్షన్ స్కీంలో పెట్టుబడులు. సిప్ ద్వారా భారీ రిటర్న్స్





SIP in National Pension Scheme: 

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందులోనూ క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక (సిస్టమాటిక్ ఇన్వెస్టమెంట్ ప్లాన్-SIP- సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే సిప్ (SIP) చిన్న చిన్న పొదుపు మొత్తాల్లో పెట్టుబడి పెట్టేవారికి దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది. త్వరలో జాతీయ ఫించను పథకంలో (National Pension Scheme -NPS)లో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందుకు సంబంధించి PFRDA చివరి దశ పరీక్షలను నిర్వహిస్తోంది. NPSలో సిప్ విధానాన్ని దసరాలోపు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని SDL ఈ-గవర్నెన్స్ ఉపాధ్యక్షుడు అమిత్ సిన్హా తెలిపారు. "జాతీయ ఫించను పథకంలో సిప్ ద్వారా పెట్టుబడులను త్వరలో ప్రారంభించనున్నాం. ఇందుకు సంబంధించి చివరి దశ పరీక్షల నడుస్తున్నాయి. దసరాలోపు NPSలో SIP సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం" అని ఆయన అన్నారు.

ఫోన్ బిల్లు కట్టినట్లే పెట్టుబడులు పెట్టొచ్చు : 

మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌లు ఎలా పనిచేస్తాయో... NPSలోనూ అదే విధంగా పనిచేస్తాయి. SIP అంటే ఓ పెట్టుబడిదారుడు నిర్దిష్టమైన మొత్తాన్ని పెట్టుబడికి క్రమం తప్పకుండా డెబిట్ చేయమని బ్యాంకును ఆదేశించే ఓ టెక్నిక్. రిటైల్ పెట్టుబడుదారులు పెట్టుబడి పెట్టడానికి క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళిక సౌకర్యంగా ఇది గొప్ప మార్గం. ఆటో డెబిట్ ద్వారా ప్రజలు ఫోన్, విద్యుత్, ఇతర వినియోగపరమైన బిల్లులను చెల్లించినట్లే... NPSలో సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు. NPSను మెరుగుపరిచి పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈమధ్యే PFRDA... ఎలాంటి పేపర్ వర్కూ లేకుండా NPS చందాదారులను ఇంటర్నెట్‌లోనే నామినేషన్ చేసుకునేందుకు అనుమతించింది. ఇంతకుముందే ఉన్న NPS చందాదారులు తమ నామినేషన్‌ను మార్చుకోవాలంటే S2 ఫామ్‌ను నోడల్ కార్యాలయంలో సమర్పించాలి. తమ వివరాలను భౌతికంగా మార్చుకునేందుకు లేదా అప్‌‍డేట్ చేసుకునేందుకు అభ్యర్థనను సమర్పించాలి.

ఫించన్ పథకం డిజిటలైజ్ : 

NPS క్రమంగా తన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి మరిన్ని సేవలను జోడిస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో మొత్తం ప్రక్రియను డిజిటల్‌గా మార్చాలని ప్రభుత్వ పెన్షన్ పథకం నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తాము అన్ని ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి కృషిచేస్తున్నామనీ, కరోనా కారణంగా పనిని ఇంకా వేగవంతం చేస్తున్నామని అమిత్ సిన్హా అన్నారు. ఈ క్యాలెండర్ చివరి నాటికి NPSను డిజిటల్ చేస్తామని తెలిపారు. 

Source : https://telugu.news18.com/


0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top