రైలులో నుండి ఫోన్ లేదా పర్సు పడిపోతే ఏం చేయాలి ?
రైలు ప్రయాణాలు చాలా మంది ఇష్టపడతారు..
ఇతర వాహనాల శబ్దాలు ఏమీ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అలా రైలు వెళ్లిపోతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది.
అందుకే సమయం ఎక్కువ పట్టినా పర్వాలేదు హాయిగా ఏ తల నొప్పి లేకుండా వెళ్లొచ్చు అని అనుకునేవారు రైలులో వెళ్ళడానికి ఇష్టపడతారు.
కానీ ఒకసారి రైలు ప్రయాణం లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
అందులో ఒకటి కిటికీలో నుంచి ఏమైనా వస్తువు పడిపోవడం. కొంతమంది చుట్టూ ఉన్న సీనరీ బావుంది అని ఫోటో తీయడానికి తమ ఫోన్ తీసి కిటికీ లో నుండి బయటికి పెట్టి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ వుండగా ఫోన్ చేయి జారి పడిపోవచ్చు.
రైలు తొందరగా వెళుతుంది కాబట్టి, కిందపడిన వస్తువు ఎంత ఖరీదు అయినా సరే ఇంక ఆ వస్తువు గురించి మర్చిపోవాల్సిందే. కానీ మీకు ఒకటి తెలుసా? ఇలా రైలులో ప్రయాణించేటప్పుడు మీ వస్తువు ఏదైనా కింద పడిపోతే దగ్గరలోని రైల్వే స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇవ్వడానికి మీ వస్తువు పడిపోయిన ప్రదేశం ఏంటో మీకు తెలిస్తే చాలు.
ట్రైన్ అంత వేగంగా వెళుతూ ఉంటే అసలు కిటికీ బయట ఏముందో చూడడమే కష్టమంటే. ఇంకా పడిపోయిన ప్రదేశం గురించి ఏం తెలుస్తుంది? అని అనుకుంటున్నారా? ఆ ప్రదేశం గురించి అంటే ప్రదేశం పేరు కాదు.
మన ట్రైన్ ప్రయాణించే ట్రాక్ పక్కన కొన్ని స్తంభాలుంటాయి.ఆ స్తంభాల మీద రెండు నంబర్లు ఉంటాయి. ఆ రెండు నెంబర్లకి మధ్య / సింబల్ ఉంటుంది. / సింబల్ పైన ఉన్న నంబర్ మీరు ట్రైన్ దిగే ప్రదేశం వరకు ప్రయాణించాల్సిన కిలోమీటర్లని సూచిస్తుంది. / సింబల్ కింద ఉన్న నంబర్ ఆ స్తంభం నెంబర్ సూచిస్తుంది.
కాబట్టి రైలు మీ వస్తువు పడిపోయిన ప్రదేశం దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న జి ఆర్ పి (గవర్నమెంట్ రైల్వే పోలీస్) కి గాని లేదా స్టేషన్ మాస్టర్ కి గాని ఫిర్యాదు చేయండి. మీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది అని హామీ అయితే ఇవ్వలేరు కానీ మీరు ఇచ్చిన కంప్లైంట్ ని పరిశీలించి వస్తువు కోసం కచ్చితంగా గాలిస్తారు.
0 Post a Comment:
Post a Comment