Tuesday 22 September 2020

కళాశాలల్లో నవంబర్​ 1 నుంచి క్లాసులు- వేసవి సెలవులు కట్​

కళాశాలల్లో నవంబర్​ 1 నుంచి క్లాసులు- వేసవి సెలవులు కట్​








▪️ దేశవ్యాప్తంగా తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు డిగ్రీ, పీజీ తొలి సంవత్సర విద్యార్థుల కోసం రూపొందించిన నిబంధనలను యూజీసీ ఆమోదించింది. కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి, శీతాకాల సెలవులను కుదించాలని నిర్ణయం తీసుకుంది.

▪️ కళాశాలల పునఃప్రారంభం కోసం యూజీసీ ఏప్రిల్​లోనే ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్​ను ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి కళాశాలలను తెరవాలని సూచించింది. అయితే కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు రూపొందించింది.

సెలవులు కుదించి...

▪️ కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి, శీతాకాల సెలవులను కుదించాలని నిపుణుల కమిటీ సూచించింది. విశ్వవిద్యాలయాలు ఆరు రోజుల పాటు నిత్యం విద్యాభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. సవరించిన మార్గదర్శకాలు ఇలా...

▪️అక్టోబర్ 31 నాటికి తొలి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తికావాలి.

▪️ తొలి సెమిస్టర్​ క్లాసులను నవంబర్ 1 నుంచి ప్రారంభించాలి.

▪️ కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడం కోసం వేసవి, శీతాకాల సెలవులను తగ్గించాలి.

▪️ ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలి.

▪️ ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలలో వారానికి ఆరు రోజుల ప్రణాళికను యూనివర్సిటీలు అమలు చేయాలి.

▪️ నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లిందని యూజీసీ పేర్కొంది. మధ్యలో విరామాల(వేసవి, శీతాకాల సెలవుల)ను తగ్గించడం వల్ల మూడేళ్ల యూజీ/పీజీ కోర్సుల విద్యార్థులు సకాలంలో తమ కోర్సు పూర్తి చేసుకోగలుగుతారని పేర్కొంది.

▪️ మార్చి 16 నుంచి దేశంలో కళాశాలలు, పాఠశాలలను మూతపడ్డాయి. కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top