Saturday 18 January 2020

ఇంగ్లీషు మీడియం కావాలా?.. తెలుగు మాధ్యమంలో చదువుతారా ? విద్యాశాఖ అభిప్రాయ సేకరణ - ఎల్లుండి పేరెంట్స్‌ కమిటీల భేటీలు - 23 నాటికి కమిషనర్‌కు ‘ఆప్షన్లు’.



ఇంగ్లీషు మీడియం కావాలా?.. తెలుగు మాధ్యమంలో చదువుతారా ? విద్యాశాఖ అభిప్రాయ సేకరణ - ఎల్లుండి పేరెంట్స్‌ కమిటీల భేటీలు - 23 నాటికి కమిషనర్‌కు ‘ఆప్షన్లు’








 ‘ఆరునూరైనా ఆంగ్ల మాధ్యమమే’ అని తేల్చి చెప్పిన సర్కారు... 
ఇప్పుడు బాణీ మార్చింది. ‘మీ పిల్లలకు ఏ మీడియం కావాలి? తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధిస్తూ ఇంగ్లీషు మీడి యం కావాలా! లేక తెలుగు మీడియం కావాలా! ఈ రెండింటిలో ఒకటి ఎం చుకోండి’’ అని విద్యార్థుల తల్లిదండ్రులను కోరింది. తమ పిల్లలను చదివించాలనుకుంటున్న గ్రామంలోని పాఠశాల పేరెంట్స్‌ కమిటీకి ఈ ‘ఆప్షన్‌’ తెలియచేయాలని సూచించింది. దీనికోసం పాఠశాల విద్యాశాఖ ఒక ప్రత్యేక ఫారాన్ని రూపొందించింది. శనివారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు మెమో జారీ చేశారు. ‘‘ఈ నెల 21న పేరెంట్స్‌ కమిటీ సమావేశం నిర్వహించాలి. తల్లిదండ్రులందరి నుంచి ఆప్షన్‌ తీసుకోవాలి. ఆప్షన్ల ఫారాలన్నింటినీ పాఠశాల వారీగా బౌండ్‌ చేసి మండల విద్యాధికారికి పం పించాలి’’ అని ఈ మెమోలో పేర్కొన్నారు. వీటిని ఈ నెల 22న జిల్లా విద్యాధికారికి పంపించాలని ఎంఈఓలను ఆదేశించారు. డీఈఓలు వాటిని ఈ నెల 23న కమిషనర్‌ కార్యాలయానికి పంపించాలని పేర్కొన్నారు.

ఏమిటీ మార్పు...
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయడంపై భాషాభిమానులు, సామాజిక వేత్తలు, విద్యా విషయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, విపక్ష నేతలూ ఇదే కోరారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూనే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని... ఏ మీడియం ఎంచుకోవాల న్న స్వేచ్ఛను విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇవ్వాలని సూచించారు. ఇందుకు సర్కారు ససేమిరా అంది. ‘‘మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? బడుగుల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవొద్దా’’ అంటూ సీఎంతోపాటు మంత్రులూ ఎదురుదాడి చేశారు. ఆంగ్ల మాధ్యమంపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.

   ఈ బిల్లుపై శాసన సభలో ఆమోదముద్ర పడినా... 
 శాసనమండలిలో చుక్కెదురైంది. విద్యార్థులు తమకు ఇష్టమైన మాధ్యమాన్ని ఎం చుకునే అవకాశం ఉండాల్సిందేనని సభ్యులు పట్టుపట్టారు. ఆ తర్వాత దీని పై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఒకేసారి మొత్తం ఇంగ్లీషు మీడియం ఎలా ప్రవేశ పెడతారని హైకోర్టు ప్రశ్నించింది. తుది తీర్పు వచ్చే వరకూ ఇంగ్లీషు మీడియంలో పాఠ్యపుస్తకాలు ముద్రించరాదని , టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్‌సీఈఆర్టీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా కమిషనర్‌ శనివారం ఇంగ్లీషు- తెలుగు మీడియంలలో ఏది కావాలో ఆప్షన్‌ ఇవ్వాలంటూ క్షేత్రస్థాయి అధికారులకు మెమో జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... ఈ ఆప్షన్లలో ‘ఇంగ్లీషు మీడియానికి సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఉండాలని కోరుకుంటున్నారా?’ అనే అంశం లేకపోవడం గమనార్హం.

Introducing English Medium from Class I to VI from 2020-21 onwards – obtaining of option from the parents- Collection of option forms – certain instructions.

★ 2020-21 విద్యా సంవత్సరం నుండి  ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వం ప్రారంభించనుంది.

★ 21.01.20 న ప్రతి పాఠశాలలోనూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి.

★ తల్లిదండ్రులు వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తారు Option ఫారం తీసుకోవాలి.

★ 23.01.20 లోపు RJDSEs వాటిని బైండింగ్ చేసి కమిషన్ ఆఫీస్ కు అందేలా చర్యలు తీసుకోవాలి.

గమనిక: ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ ఫారాలను విద్యార్థి వారీగా తల్లిదండ్రుల నుంచి ఒకటి నుండి ఐదు తరగతుల వరకు మాత్రమే తీసుకోవాలి. అనగా ఉన్నత పాఠశాల వారు అవసరం లేదు. అదేవిధంగా ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరో తరగతి నుండి అవసరం లేదు.

 అందరు జిల్లా విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్స్, సమగ్ర శిక్ష, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు మరియు ప్రధానోపాధ్యాయులకు తక్షణ సూచనలు:


క్రింది డిక్లరేషన్ ఫామ్ మరియు సూచనలు గమనించగలరు :

ఈ డిక్లరేషన్ ఫామ్ ఒకటి నుండి అయిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వవలసి ఉంటుంది.

21-012020న తల్లిదండ్రుల సమావేశము జరిపి, ఈ ఫామ్ పూర్తిగా నింపి, పాఠశాల వారిగా బౌండ్ చేసి, ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారులకు చేర్చవలసి ఉంటుంది.

అన్ని మండలాలు కలెక్ట్ చేసుకుని, 22-01-2020న జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది.

కావున సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ దీనిని అతి జరూరుగా చేపట్టవలసిన కార్యక్రమం గా భావించి, ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం తప్పనిసరిగా పూర్తి చేయవలసిందిగా ఆదేశించడం అయినది.

 సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు మరియు అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్ష, తగిన పర్యవేక్షణ జరిపి, మండలాల వారీగా సేకరించిన పత్రములను 23-01-2020 నాటికి కమిషనర్ వారి కార్యాలయానికి పంపవలసిందిగా కోరడమైనది.





0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top