Sunday 29 December 2019

జగనన్న అమ్మఒడి - జాబితాలు - Required Forms



జగనన్న అమ్మఒడి - జాబితాలు - Required Forms








1. అర్హుల జాబితా :

White Ration Card , Aadhaar card , Bank Account IFSC CODE తో పక్కాగా ఉండాలి. ఇలా అన్ని సక్రమంగా ఉన్నవారికి మాత్రమే పథకం పొందే అర్హత ఉంటుంది. ఇది మొదటి జాబితా. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వీరికి అమ్మఒడి వర్తిస్తుంది.



2. With held జాబితా :

ఈ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగుల, TAX పేయర్ల పిల్లలు వస్తారు. వీరికి అమ్మఒడి సాయం వర్తించదు. సామాజిక తనిఖీల్లో అనర్హత జాబితాల కింద వీరిని ప్రక్కన పెడతారు.



3. Request for Reverification జాబితా :

దరఖాస్తు సమయంలో White Ration Card , Adhar Card,  Bank Account పక్కాగా జతచేయకపోవడం వంటి తప్పులు చేసినవారు ఇందులో ఉంటారు. వీరు white Ration Card, Aadhaar, Mother Bank Account వివరాలు సచివాలయంలో అందజేస్తే దరఖాస్తు సరిచేస్తారు.
    ఈ ప్రక్రియ జనవరి 1 వరకు కొనసాగుతుంది. జాబితాలో తప్పు పడిన పేర్లు , చిరునామాలు ఈ దశలో సరిచేస్తారు. వీరిని మొదటి అర్హుల జాబితాలో చేర్చుతారు.

    గ్రీవెన్స్ సెల్ జనవరి 1 తో పూర్తవుతుంది. అనంతరం గ్రామ సచివాలయం యూనిట్ గా ఐదు రోజులపాటు సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. అర్హుల పేర్లు తప్పినా, అనర్హుల పేర్లు చేరినా , అక్రమాలు చోటుచేసుకున్న సామాజిక బృందాలు సరిచేస్తాయి.


జనవరి 4 నాటికి తుదిజాబితాలు సిద్ధంఅయ్యే అవకాశాలు ఉన్నాయి.

జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం నగదు బ్యాంకు ఖాతాల్లో విడతలుగా జమ చేస్తారు.









1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.

2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో  List-II & List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II & List-III లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.

   పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో  అందజేయాలి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top