Monday, 28 October 2019

నేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం - 29 అక్టోబర్ - వివరాలునేడే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం - 29 అక్టోబర్ - వివరాలు

   
 

     
🖥 నిజంగా ఇది చాలా అద్భుతం.. ఇంటర్నెట్ మనుషులు జీవితాలనే మార్చేసింది. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం అక్టోబర్ 29, 1969న 22.30 నిమిషాలకు రెండు కంప్యూటర్ల మధ్య మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేయటం జరిగింది.

వివరాల్లోకి వెళితే... 

🖥 లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీఎల్ఏ)లో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్ ARPANET ( ఆడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) ద్వారా ప్రొఫెసర్ లియోనార్డ్ క్లెయి న్రాక్ పర్యవేక్షణలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ఎస్‌డిఎస్ సిగ్మా 7 హోస్ట్ కంప్యూటర్ నుంచి స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉన్న మరో ప్రోగ్రామర్‌కు చెందిన ఎస్ఆర్ఐ ఎస్‌డిఎస్ 940 హోస్ట్ కంప్యూటర్‌కు మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేసారు.

🖥 రెండు కంప్యూటర్ల మధ్య ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపేందుకు ఇంటర్నెట్‌ను మొదటి సారిగా వినియోగించిన సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 29ని అంతర్జాతీయ ఇంటర్నెట్ డేగా ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగతా ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న అంతర్జాతీయ అంతర్జాల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇంటర్నెట్ పై పరిశోధనలు జరుగుతున్న రోజుల్లో ఇంటర్నెట్, ARPANETగా పిలవబడేది.

🖥 2005 నుంచి ప్రపంచ ఇంటర్నెట్ దినోత్సవాన్ని టెలీకమ్యూనికేషన్స్ ఇంకా టెక్నాలజీ చరిత్రలో చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణిస్తున్నారు. ఇంటర్నెట్ గురించి పలు ఆసక్తికర వాస్తవాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

🖥 అంతర్జాలాన్ని ఆంగ్లంలో "ఇంటర్నెట్" (Internet) అని అంటారు. అంతర్జాలము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు.

🖥 "ఇంటర్నెట్ " అంటే ఏమిటో అర్ధం అవటానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక పేటలో ఉన్న ఇళ్ళని కలుపుతూ ఒక వీధి ఉంటుంది. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళటానికి ఈ వీధి అవసరం. ఊళ్ళో ఉన్న పేటలన్నిటిని కలుపటానికి అల్లిబిల్లిగా అల్లుకుని ఊరు నిండా పెద్ద రహదారులు (రోడ్లు) ఉంటాయి. ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళ్ళటానికి ప్రాంతీయ రహదారులు ఉంటాయి. ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళటానికి సముద్రంలోనూ, ఆకాశంలోనూ 'అంతర్జాతీయ రహదారులు' ఉంటాయి. ఒక మేపులో చూస్తే ఈ చిన్నవీధులు, రహదారులూ అన్ని ఒక జాలరివాడి వలలా కనిపిస్తాయి. ఇదే విధంగా ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతీయ వలల లాగా, పెద్ద పెద్ద అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలలాగా కనిపిస్తాయి కనుక వీటిని అంతర్జాలం అంటారు.

🖥 ఇంటర్నెట్ చరిత్ర చాల పెద్దది*. *అమెరికా భద్రతా విభాగమయిన "ఎడ్వాన్సెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఆర్పా(ARPA)" వారి నిధులతో సృష్టించబడింది.

🖥 పీ.సీ లకు మొబైల్ ఫోన్ లకు ఇంటర్నెట్ వేగం రకరకలా విధాలుగా 100 యంబీపీయస్ నుండి శక్తివంతమైన 4జీ (జెనరేషన్), కొన్ని ఏరియాల్లో 5జీ (జెనరేషన్) ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నది.

🖥 ప్రమాదకరమైన సైట్లకు వెళ్ళినట్లయితే, మీ కంప్యూటరుకు వైరస్ సోకి చెడిపోయే ప్రమాదం ఉంది.

🖥 అంతర్జాలంలో ఇంకా సమర్ధమయిన monitoring systems లేవు. కనుక చిన్నపిల్లలు పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన సైట్లకు వెళ్ళినట్లయితే వారి మనసుల మీద దుష్ప్రభావంపడే అవకాశం ఉంది.

🖥 అంతర్జాలంలో అనవసర విషయాలు వల్ల మన అముల్యమైన సమయం వృధా అవుతుంది.కనుక మంచి మరియు అవసరమైన విషయాల కోసం ఉపయోగించాలి.

 🖥 నేటి ఆధునిక యువత పై ఇంటర్నెట్ త్రీవస్థాయిలో ప్రభావం చూపుతోంది. కమ్యూనికేషన్ విభాగంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటర్నెట్ మత్తులో మునిగితేలుతున్న యువత తమ తమ లక్ష్యాలను పక్కన పెట్టి కంప్యూటర్లు..

🖥 స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. గంటల కొద్ది చాటింగ్.. ఇంటర్నట్ బ్రౌజింగ్ ఇలా అదేపనిగా వెబ్ ప్రపంచంలో విహరిస్తున్నారు.

🖥 వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..?, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.

🖥 నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులనురాబడుతున్నాయట..ఇంటర్నెట్‌లో 40% వాటా పోర్న్ వెబ్‌సైట్‌లదే..

🖥 ఇంటర్నెట్‌కు బానిసలుగా మారిన వారి కోసం చైనా ప్రత్యేక వైద్య క్యాంపులను నిర్వహింస్తోందట.

🖥 ఇంటర్నెట్ సామ్రాజ్యంలో రోజుకు 30,000 వెబ్‌సైట్‌లు హ్యాక్ అవుతున్నాయి.

🖥 ఇంటర్నెట్ యూజర్లు నిమిషానికి 204 మిలియన్‌ల ఈ-మెయిల్స్‌ను పంపుతున్నారు.

వీటిని సెర్చ్‌ చేస్తే.. మీ మీద నిఘా ఉన్నట్టే..

🖥 ఏ విషయం గురించి సమాచారం కావాలన్నా తడుము కోకుండా వెతికేది గూగుల్‌ సెర్చ్‌లోనే...

🖥 ఎటువంటి సమాచారమైన గూగుల్‌లో అందుబాటులో ఉంటుంది. తెలిసో, తెలియకో చాలా విషయాలను సెర్చ్‌ చేస్తూ ఉంటాం. అయితే మనం తెలియక చేసే కొన్ని తప్పులు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది.

🖥 అయితే అందులో కొన్ని మనం చూడకూడని సైట్లు కూడా ఉంటుంటాయి. కొన్ని వెతకకూడని అంశాలు ఉంటాయి. కొన్ని విషయాలు వెతికినప్పుడు పర్లేదు కానీ కొన్ని విషయాలు వెతకడం అంత మంచిది కాదు. అలాంటి సందర్భాల్లో మీరు విషయాలు కాకుండా సమస్యలు వెతుకుతున్నట్లు అవుతుంది.

🖥 ఇంటర్నెట్‌లో ఉన్న సమస్యలు తెచ్చి ఇంట్లో పెట్టుకోకుండా ఉండాలంటే ఏయే విషయాలను సెర్చ్‌ చేయకూడదో తెలుసుకుందాం..

చైల్డ్‌ పోర్నోగ్రఫీ...

🖥 ఈ మధ్య కాలంలో మన దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉన్నాయి.

🖥 రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, కిడ్నాప్‌లు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు చైల్డ్‌ పోర్నోగ్రఫీనే కారణమని చాలా సందర్భాల్లో తేలింది. ఇటువంటి కేసుల్లో ఉన్న నిందితులు కూడా అటువంటి వీడియోలను చూడటం కారణంగా ప్రభావితం అవ్వడం కారణంగానే ఇలాంటి పనులు చేస్తున్నట్లు విచారణలో తేలుతుండడంతో ఉండటంతో దీనిపై నిఘా పెట్టారు. మన దేశంలో ఏకంగా ఇటువంటి వీడియోలపై నిషేధం కూడా విధించారు.
ఆత్మహత్య

🖥 ఏదో సరదాగా తెలుసుకుందామని కొంతమంది లేదా బాగా డిప్రెషన్‌కు గురైన వాళ్ళో ఆత్మహత్య ఎలా చేసుకోవాలి అని వెతుకుతూ ఉంటారు. అలాంటి విషయాల గురించి సెర్చ్‌ చేసినట్లయితే పోలీసులు కొన్ని నిమిషాల్లోనే మీ ఐపీ అడ్రెస్‌ను ట్రేస్‌ చేసి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా డిప్రెషన్‌లో ఉంటే కౌన్సెలింగ్‌ చేస్తారు. లేదా సరదాకి చేసి ఉంటే వాళ్ళ రీతిలో స్పందిస్తారు. అందువల్ల ఇలాంటి విషయాలు సెర్చ్‌ చేయకుండా ఉంటేనే మంచిది.

ఆయుధాలు

🖥 గూగుల్‌లో How to make a bombµ, How to get a gunµ లాంటి పదాలను అస్సలు సెర్చ్‌ చేయకూడదు. ఎందుకంటే అటువంటి పదాలను సెర్చ్‌ చేస్తే మీ ఐపీ అడ్రెస్‌ను ట్రేస్‌ చేసి మీ మీద నిఘా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటి గురించి అస్సలు వెతకకుండా ఉండటమే మంచిది.

వ్యక్తిగత వివరాలు
   
🖥 మనం సెర్చ్‌ చేసిన ప్రతిదీ గూగుల్‌ స్టోర్‌ చేసుకుంటుంది. ఈ విషయం తెలియక అత్యుత్సాహానికి పోయి కొంతమంది తమ పేరు, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌, మెయిల్‌ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఏం వస్తాయో చూద్దామని చేస్తుంటారు. ఇలాంటివి చేస్తే జైలుకి వెళ్లే అవకాశం ఉండదు కానీ , డేటా చోరీకి గురయ్యే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత వివరాలను గూగుల్‌లో అస్సలు సెర్చ్‌ చేయవద్దు. ఇవే కాక చెడుకు సంబంధించిన ఏ విషయాలు సెర్చ్‌ చేసినా ఎంతో కొంత నష్టమే జరిగే అవకాశం ఉంది. అందువల్ల అవసరమైనవి, విజ్ఞానాన్ని అందించే వాటి గురించి మాత్రమే తెలుసుకుంటే మేలు.

🌷సేకరణ
మధు బాబు,

0 comments:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top