Thursday 18 April 2019

AP e-SR ( EMPLOYEE PERSONAL DETAILS UPDATION )



AP e-SR
 ( EMPLOYEE PERSONAL DETAILS UPDATION )







ఉద్యోగుల సర్వీసు రిజిస్టరు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు మాన్యువల్‌గా ఉన్న సర్వీస్‌ రిజిస్టర్‌ను ఈ - ఎస్‌.ఆర్‌గా మారుస్తున్నారు. మొదట డిజిటలైజేషన్‌ చేయాలనుకున్నా, మార్పులు, చేర్పులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థిక శాఖ గుర్తించింది. అందుకే ఈ - ఎస్‌ఆర్‌ రూపకల్పనకు నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు లోపు ఈ మొత్తం కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల/ఉద్యోగులు పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ - ఎస్‌.ఆర్‌ను ఉద్యోగుల CFMS ఐడీ నంబరు ద్వారా చూసుకోవచ్చు. మెరుగైన విధానంతో రూపొందుతున్న ఈ - ఎస్‌.ఆర్‌తో భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

సర్వీసు రిజిస్టరు అంటే...?
   ఉద్యోగి వ్యక్తిగత వివరాలు, అర్హతలు, ఉద్యోగ వివరాలు, కుటుంబ వివరాలు, ఉద్యోగ జీవితంలోని వివరాల సమగ్ర పట్టిక సర్వీస్‌ రిజిస్టర్‌. దాదాపు వంద పేజీల ఈ పుస్తకాన్ని ఉద్యోగి తన సర్వీసు కాలమంతా వినియోగించుకోవచ్చు. శాఖాధిపతులు ఈ పుస్తకంలో వివరాలన్నీ నమోదు చేస్తారు. ఈ పుస్తకం ఒకటి మాత్రమే ఉంటుంది. కనిపించకుండా పోయినా, ధ్వంసమైనా, కాలిపోయినా.. మళ్లీ తయారు చేయడం కష్టం. అందువల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక లాకర్‌లో ఎస్‌.ఆర్‌లను ఉంచుతారు.

ఈ - ఎస్‌.ఆర్‌ ఎలా...?
   ఫార్మాట్‌ ప్రకారం ఉద్యోగులు మొదట తమ వివరాలు నమోదు చేయాలి. అనంతరం అవసరమైన సర్టిఫికెట్లు సంబంధిత శాఖాధిపతులకు అందజేయాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు వారు ధ్రువీకరించాక ఉద్యోగులు తమ తమ ట్రెజరీ ఐడీ నంబరు ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఏ వివరాలు ప్రొఫార్మాలో ఉన్నాయో ఆ వివరాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. అప్‌లోడ్‌ సమయంలో ముందుగా ధ్రువీకరించుకోవాలి. పుట్టిన తేదీ, ఇంక్రిమెంట్లు వంటి వాటిని మార్చకూడదు. పాత ఎస్‌.ఆర్‌కు ఈ-ఎస్‌ఆర్‌కు ఎటువంటి తేడాలున్నా అందుకు శాఖాధిపతులే బాధ్యత వహించాలి. పింఛన్‌ వివరాలు, నామినీ పేరు మార్చుకోవచ్చు. అప్‌లోడ్‌ సమయంలో వివరాలు ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకోవాలి. సందేహాలుంటే సంబంధిత శాఖాధిపతుల ద్వారా క్లియర్‌ చేసుకుని అప్‌లోడ్‌ చేయాలి. ఒకసారి అప్‌లోడ్‌ అయితే చూసుకోవడమే తప్ప మార్పులకు అవకాశం ఉండదు. అప్‌లోడ్‌ అయ్యాక ఉద్యోగులు ట్రజరీ ఐడీ నెంబర్‌ ఆధారంగా ఈ - ఎస్‌.ఆర్‌ను చూసుకోవచ్చు.

రిజిస్టరు వివరాలు :
   ఈ-ఎస్‌ఆర్‌లో 12 దశల్లో వివరాలు నమోదు చేయాలి. వాటిని శాఖాధిపతులకు అందించాలి. వారి ద్వారా అప్‌లోడ్‌ చేయించాలి. తగిన ఆధారాలు, సర్టిఫికెట్లు పొందుపరచాలి. సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే పాత ఎస్‌ఆర్‌లో వివరాలు ఆధారంగా నమోదు చేయాలి. కొత్త ఉద్యోగులు సర్టిఫికెట్లు అందించాలి. ఈ ఏడాది ఆగస్టులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. రిజిస్టర్లను జిల్లాలవారీగా, శాఖల వారీగా, సర్వీసులో చేరిన సంవత్సరాల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.

ఈ - ఎస్‌.ఆర్‌ ఉపయోగాలు:
   ↪ఉద్యోగికి సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. బదిలీలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, సెలవు ఖాతాల వివరాలు చూసుకోవచ్చు.

   ↪సర్వీసు రిజిస్టర్‌ను భద్రపరుచుకునే అవసరం ఉండదు. ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు.

   ↪ఒకసారి వివరాలు అప్‌లోడ్‌ అయ్యాక ఇతర అధికారులు, సంబంధం లేని వ్యక్తులు ఎంట్రీలు వేసేందుకు అవకాశం ఉండదు. ఇతరులు మార్పులు చేయలేరు.

   ↪సర్వీస్‌ రిజిస్టర్‌ను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉండదు. నూరు శాతం భద్రత ఉంటుంది.

   ↪పదవీ విరమణ సమయంలో అన్ని వివరాలు అందుబాటులో ఉన్నందున పరిహారం, పెన్షన్‌ వేగంగా పొందవచ్చు.

వ్యక్తిగత సమాచారం: 
   ఇందులో పేరు, చిరునామా, సర్వీస్‌లో చేరిన తేదీ, పూర్తి చేసిన తేదీ, ఉద్యోగుల కేడర్‌, ఆధార్‌ నెంబర్‌, ట్రెజరీ గుర్తింపు కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, విద్యార్హతలు, పాన్‌ నెంబర్‌, పుట్టిన ఊరు ఉంటాయి.

సర్టిఫికెట్‌ వివరాలు: 
   ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల ధ్రువీకరణ, ఉద్యోగం వచ్చే సమయంలో పోలీసుల వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌, నామినీ పేరు, వివరాలు, కుటుంబ పెన్షన్‌ అర్హల వివరాలు ఉంటాయి.

సర్వీసు వివరాలు:  
   ఎప్పుడు ఉద్యోగంలో చేరారు, ఏ కేడర్‌లో చేరారు, చేరిన తేదీ, ప్రొబేషన్‌ కాలం, పదోన్నతులు, బదిలీలు, పే రివిజన్‌లు సిఫారసుల మేరకు జీతం పెరుగుదల వివరాలు నమోదు చేయాలి. 2004 తర్వాత ఉద్యోగంలో చేరితే సీపీఎస్‌ విధానంలో చేరిన వివరాలు నమోదు చేయాలి.

 జీతభత్యాలు:  
   ఉద్యోగి మూల వేతనం, వివిధ అలవెన్సులతో పొందుతున్న జీతం వివరాలు, సంపాదిత సెలవులు నగదుగా మార్చుకున్న వివరాలు నమోదు చేయాలి.

పెన్షన్‌ వివరాలు: 
   తన తదుపరి (మరణానంతరం) పింఛన్‌ ఎవరికి ఇవ్వాలన్న వివరాలు నమోదు చేయాలి. వివరాలు ఇచ్చాక ఉద్యోగి కంటే ముందే నామినీ చనిపోతే మరొకరిని నామినీగా చేర్చుకునే అవకాశం ఉంటుంది.

వివిధ రకాల భత్యాల వివరాలు: 
   సర్వీసులో చేరాక ఇంతవరకు తీసుకున్న రవాణా భత్యం వివరాలు, ఎప్పుడు, ఎంత మేరకు తీసుకున్నది నమోదు చేయాలి.*

రుణం వివరాలు: 
   ఇల్లు, కారు, వివాహానికి సంబంధించిన రుణాలు, అడ్వాన్స్‌ల వివరాలు, నింపాలి*

బీమా పథకాలు: 
   జీవిత బీమా పథకాల వివరాలు, అందుకోసం కటింగ్‌లు తెలియజేయాలి. ఏపీ ప్రభుత్వ జీవిత బీమా(ఏపీజీఎల్‌ఐ) వివరాలు అప్‌లోడ్‌ చేయాలి.

తనిఖీలు: 
   సర్వీసులో ఉండగా తనిఖీలు, అధికారుల ప్రశంసలు, రివార్డులు, సస్పెన్షన్‌ ఆర్డర్లు, అందిన మెమోలు నమోదు చేయాలి. లేకుంటే ఖాళీగా వదిలిపెట్టాలి.

శాఖాపరమైన పరీక్షలు: 
   ఉద్యోగులు పదోన్నతుల కోసం రాసే వివిధ రకాల పరీక్షల వివరాలు, పాసైన నెంబర్లు, ఫలితాలు వచ్చిన ప్రభుత్వ గెజిట్‌ నెంబరు తేదీలు నమోదు చేయాలి. శాఖాపరమైన పరీక్షలకు ఎక్కుడ మాజరైంది పేర్కొనాలి.

శిక్షాపరమైన అంశాలు: 
   ఉద్యోగి సర్వీసులో కేసులు ఎదుర్కొంటే ఆ వివరాలు, జైలు శిక్ష పొందినా, రిమాండ్‌ విధించినా ఆ వివరాలు నమోదు చేయాలి. శిక్ష అమలైతే ఏఏ అంశాలలో పాత్ర ఉందన్న విషయం నిర్ధారణ అయ్యిందో రాయాలి.*

పెన్షన్‌ ప్రణాళికలు:
   ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయంలో పెన్షన్‌ ఏ విధంగా తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ వివరాలు నమోదు చేయాలి. పెన్షన్‌ ప్రభుత్వానికి అమ్ముకోవాలనుకుంటే ఆ వివరాలు అందించాలి.

1 comment:

  1. Sir/Madam E-SR depends on OTP based is secure. Please inform to concern department.
    Thank you..

    ReplyDelete

Latest info

More

Teacher's need

USEFUL APPLICATION FORMS

More

LEAVE RULES

More
Blinking Text
Top