Saturday 5 June 2021

చాలా మందికి కరోన రాకపోయిన బ్లాక్ ఫంగస్ వస్తుంది…! కారణం ఇదే

చాలా మందికి కరోన రాకపోయిన బ్లాక్ ఫంగస్ వస్తుంది…! కారణం ఇదే







అస‌లే క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తుంటే.. ఇప్పుడు మ‌రింత భ‌య‌పెట్టేందుకు బ్లాక్ ఫంగ‌స్‌ వ‌చ్చేసింది. క‌రోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ ( Mucormycosis ) అని పిలిచే ఈ ఇన్‌ఫెక్ష‌న్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగ‌స్ కార‌ణంగా క‌రోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవ‌డం.. మ‌రికొంద‌రు అయితే ప్రాణాల‌ను కోల్పోవ‌డం ఇప్పుడు అందోళ‌న క‌లిగిస్తుంది. అస‌లు ఈ బ్లాక్ ఫంగ‌స్‌ అంటే ఏంటి? ఇది ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఈ ఫంగ‌స్ అంత ప్ర‌మాద‌క‌ర‌మైనదా? వంటి విష‌యాలు ఇప్పుడు చూద్దాం.

కరోనావైరస్ సోకక ముందే కొందరు ముందు జాగ్రత్తగా సెల్ఫ్ మెడికేషన్ పేరుతో… కరోనా చికిత్సలో భాగంగా ఇచ్చే స్టెరాయిడ్స్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. మరికొందరు ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని తెలిసింది. కరోనా సోకకపోయినా స్టెరాయిడ్స్ అధిక వినియోగం వల్లే చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని తేలింది. స్టెరాయిడ్స్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి బ్లాక్ ఫంగస్ బాధితులుగా మారుతున్నారని గుర్తించారు. అందుకే, సొంత వైద్యం వెంటనే మానుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ”కరోనా సోకకముందే తెలిసిన ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్లి కరోనా మెడిసిన్‌ను తెచ్చుకుని ముందు జాగ్రత్త పేరుతో కొందరు స్టెరాయిడ్స్‌ను మోతాదుకు మించి వినియోగించడం వల్ల బ్లాక్ ఫంగస్‌ను కొని తెచ్చుకుంటున్నారు. కరోనా రాకముందే మెడిసిన్ తీసుకుంటే తమకు వైరస్ సోకినా ఏమీ కాదనే కొందరి ముందు జాగ్రత్త ఆలోచన బ్లాక్ ఫంగస్ సోకేందుకు కారణమవుతుంది. బ్లాక్ ఫంగస్ సోకిన తర్వాత గానీ వాళ్లు చేసింది తప్పని తెలుసుకోలేకపోతున్నారు.

అనారోగ్య సమస్య ఏదైనా డాక్టర్లను సంప్రదించకుండా ఇలా సెల్ఫ్ మెడికేషన్‌ను పాటించవద్దు. కచ్చితంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే సెల్ఫ్ మెడికేషన్ పాటించాలనుకునే వారు చికిత్స పొందాలి” అని వైద్య నిపుణులు సూచించారు.రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,179 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా. ఇందులో 14 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారు. ఒక్క గుంటూరు జనరల్ హాస్పిటల్‌లోనే దాదాపు 100కు పైగా మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఉన్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వ్యక్తికి చికిత్స నిమిత్తం రోజుకు సగటున పది యాంఫోటెరిసిన్ బీ వయల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క బ్లాక్ ఫంగస్ పేషంట్‌కు వారానికి 80 నుంచి 100 వయల్స్ అవసరమవుతాయి.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top