Sunday 6 June 2021

Black Fungus : ఇంజెక్షన్ల కష్టం - యాంఫోటెరిసిన్‌-బి కోసం బాధితుల పరుగులు !

Black Fungus : ఇంజెక్షన్ల కష్టం -  యాంఫోటెరిసిన్‌-బి కోసం బాధితుల పరుగులు !



మ్యూకార్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) చికిత్స పొందే బాధిత కుటుంబాలను ఆర్థిక కష్టాలు కుదేలు చేస్తున్నాయి. కొవిడ్‌ చికిత్సకు రూ.లక్షలు ఖర్చుపెట్టి, ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు మళ్లీ భారీగా సొమ్ము అవసరం కావడంతో కోలుకోలేకపోతున్నారు. అప్పులుచేస్తూ...ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని బాధిత కుటుంబాలు కన్నీళ్ల పర్యంతమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స మరీ భారంగా మారింది. యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లు దొరక్క బాధిత కుటుంబాలు హైరానా పడుతున్నాయి. బ్లాక్‌ఫంగస్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన ఈ ఇంజెక్షన్లు మార్కెటో దొరక్క... నల్లబజారులో కొనలేక, ప్రభుత్వం నుంచి పొందాలంటే పెడుతున్న ఆంక్షలతో కుటుంబసభ్యులు అల్లాడిపోతున్నారు. ఒక్కో ఇంజెక్షన్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.7,814. నల్లబజారులో ఒక్కోటి రూ.30-40వేలు పలుకుతోంది. ఇంజెక్షన్లు తెచ్చుకుంటేనే ఆసుపత్రిలో చేర్చుకుంటామని వైద్యులు చెబుతుండటంతో బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

70:30 నిష్పత్తిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుత్రులకు ఇంజెక్షన్లు

కృష్ణాజిల్లాలో రోజూ చాలా దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచే వచ్చే ఇంజెక్షన్లలో 70% ప్రభుత్వాసుపత్రుల్లోని వారికి, 30% ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారికి కేటాయిస్తున్నాం.

- శివశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌, కృష్ణా

బ్లాక్‌ఫంగస్‌కు ఆస్తుల పణం - అరెకరం అమ్మాల్సి వస్తోంది

మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వయసు 56. వైరస్‌ సోకి ప్రకాశం జిల్లా చీరాలలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. డిశ్ఛార్జి అయ్యే సమయంలో ముక్కు నొప్పి అని చెప్పడంతో వైద్యుల సూచనమేరకు విజయవాడకు గత నెల 3వ వారంలో వచ్చాం. ఆసుపత్రిలో చేరినప్పుడు దొరికిన 5 ఇంజెక్షన్లు వాడారు. జబ్బు తగ్గిందనుకునే సమయంలో దంతాల వద్ద ఫంగస్‌ సోకినట్లు వైద్యులు చెప్పారు. ఇప్పుడు మార్కెట్లో ఇంజెక్షన్లు దొరకడంలేదు. ప్రభుత్వం ద్వారా ఇంజెక్షన్లు పొందేందుకు తిరుగుతున్నా. ఇప్పటివరకు చేసిన ఖర్చుల కోసం ఉన్న అర ఎకరం పొలం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇంటి కాగితాలు కుదువపెట్టా

బ్లాక్‌ఫంగస్‌ సోకిన నా సోదరుడికి విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చిన్న శస్త్రచికిత్స చేశారు. మర్నాడు 7, తర్వాతిరోజు 5 ఇంజెక్షన్లను ఇచ్చారు. తాత్కాలికంగా వేరే రకం ఇంజెక్షన్లు ఇచ్చారు. తర్వాత రోజుకు 7 చొప్పున వంద వరకు ఇంజెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. దీంతో నల్లబజారులో పది ఇంజెక్షన్లను రూ.1.80 లక్షలతో కొన్నా. వీటిని రెండు రోజులు ఇచ్చారు. శనివారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు విజ్ఞప్తిచేయగా 4 ఇంజెక్షన్లను ఒక్కోటి రూ.7,814 చొప్పున ఇచ్చారు. మళ్లీ మంగళవారం 5 ఇంజెక్షన్లను అలా పొందగలిగాను. ఇంకా 68 ఇంజెక్షన్లను మా సోదరుడికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఇంటి కాగితాలు కుదువపెట్టా.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top