Friday 23 April 2021

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ ? ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి ? అర్ధమే కావడం లేదు కదూ...!! వివరాల్లోకి వెళ్తే....

 విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ ? ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి ?  అర్ధమే కావడం లేదు కదూ...!! వివరాల్లోకి వెళ్తే....



 ఇనుమును తయారు చేసే క్రమంలో భూమి లో దొరికే హెమటైట్  లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్.. (Fe2O3)ను స్టీల్ గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్  ఫర్నేస్ లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది. 

ఈ ప్రక్రియలో కర్బన సమ్మెళనమైన  "కోక్ " ను మరియు ఐరన్ ఓర్ ను దానికి కాల్షియం కార్బోనేట్ ను కలిపి మండిస్తూ ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్ ను రసాయన ప్రక్రియ కోసం ఫర్నేస్ లోకి పంపుతారు..అంటే  హెమటైట్ ముడి ఖనిజం నుండి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ (O2)  కావాలన్న మాట.

మరి దానికి కావలసిన ఆక్సిజన్ ఎక్కడినుండి తేవాలీ ?

 అందుకే స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్ ను నెలకొల్పుకుంది.

సరిగ్గా ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్ నుండే మనకు ఆక్సిజన్ తయరు చేసి కరోనా రోగుల ప్రాణాలు నిలపడానికి సరఫరా చేస్తోంది.వాతావరణం లోని గాలి లో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..

Air compressor  ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వార  మలినాలు వేరు చేసి జియోలైట్  బెడ్ తో నింపబడిన  PSA generator  ద్వారా నైట్రొజన్ ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు.ఇలా పలుమార్లు శుధ్ధీకరించబడిన ఆక్సిజన్ ను మెడికల్ ఆక్సిజన్ గా సిలిండర్ లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట.

ఇదిలా వుంటే లిక్విడ్ నైట్రోజన్ ను అతి శీతలీకారిణిగా వాడతారు.అంటే మన గ్రామాలలో మొన్నటివరకు "గోపాలమిత్ర"లు పెద్దపెద్ద ఫ్లాస్క్ లు తీసుకొచ్చేవారు గుర్తుందా?మూత తీయగానే పొగలు వస్తుండేవి..అదే లిక్విడ్ నైట్రొజన్ అన్నమాట.(పశువుల వీర్యాన్ని దీంట్లో నిల్వ చేస్తారు)

ఇదన్నమాట కధ...

"యాభైరెండు అంగుళాల ఛాతీ" కి కూడా అవసరమైతే ఊపిరిలూదడానికి సిద్దంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు.

ఏదేమైనా  ఊపిరి తీయాలనుకున్న సంస్థే నేడు దేశప్రజలకు ప్రాణాలువాయువును అందించి ప్రజల ప్రాణాలు నిలబెడుతుందనడం లో ఎలాంటి సందేహం లేదు.

0 Post a Comment:

Post a Comment

Latest info

More

Teacher's Need

Latest GO's

More

సందేహాలు - సమాధానాలు

More

USEFUL MATERIAL

More

LEAVE RULES

More
Blinking Text

KIDS SPECIAL

More

GENERAL INFORMATION

More
Top