వాహనదారులకు గుడ్‌న్యూస్.. ధ్రువపత్రాల చెల్లుబాటు గడువు మరోమారు పెంపు
❇️న్యూఢిల్లీ: వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తే. వాహన ధ్రువీకరణ పత్రాల చెల్లుబాటును ఈ ఏడాది జూన్ వరకు పెంచుతున్నట్టు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. మోటార్ వెహికిల్స్ చట్టం 1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ 1989 ప్రకారం అవసరమైన పత్రాల చెల్లుబాటు గడువును పొడిగించినట్టు పేర్కొంది.
✳️ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజస్ట్రేషన్‌తోపాటు ఇతర ధ్రువీకరణ ప్రతాలకు ఇది వర్తిస్తుంది. వీటి కాలపరిమితి ముగిసినప్పటికీ లాక్‌డౌన్ కారణంగా వాహనదారులు రెన్యువల్ చేయించుకోలేకపోయారు. ఫిబ్రవరి 1, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య చెల్లుబాటు గడువు ముగిసిన వాటికి ఇది వర్తిస్తుంది.
❇️ఫిబ్రవరి 1 తర్వాత గడువు ముగిసిన పత్రాలు జూన్ 30, 2021 వరకు చెల్లుబాటులో ఉన్నట్టుగానే పరిగణించాలని రవాణా మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
0 Post a Comment:
Post a Comment